ఈరోజు తమిళనాడులో ఎన్నికలు.. అందరి దృష్టి కోయంబత్తూర్ పై ఉంది. అన్నామలై గెలుస్తాడా? లేదా? అని.. ఎందుకు ఇంతగా అన్నామలై అట్రాక్ట్ చేశాడు. ఆల్ మోస్ట్ రెండు నెలల నుంచి అన్నామలై లేకుండా మీడియా లేదు. మీడియా కూడా వద్దు బాయ్ కాట్ చేయాలని చూసినా.. ఆయన ప్రభంజనం ముందు తేలిపోయారు. అన్నామలై మీద వార్తలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.సోషల్ మీడియాలోనూ అంతే..యూట్యూబ్ లో అన్నామలై పై వార్తలే వార్తలు..
అన్నామలై ఎందుకు ఇంతగా ప్రజలకు కనెక్ట్ అయ్యారన్నది తెలియాల్సిన అవసరం ఉంది. ఇవాళ అదే పద్ధతిలో జనం అంతా కూడా అన్నామలై గెలవాలని టెన్షన్ పడుతున్నారు. ఉద్విగ్నతకు గురవుతున్నారు. మిగతా రాజకీయ నాయకులకు ఆయనకు ఉన్న తేడా ఏంటి?
తమిళనాడు ప్రజలు, ఓటర్లు అయితే విసిగిపోయారు. అన్నాడీఎంకే, డీఎంకేపై తీవ్రంగా మండిపడుతున్నారు. చివరి రెండు రోజుల్లో కోట్ల రూపాయలు కుమ్మరించారు. డబ్బుల్లేకుండా టికెట్లు ఇవ్వని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో తాను నిజాయితీగా రాజకీయాలు చేస్తాను.. అవినీతికి పాల్పడను.. ఈ తమిళనాట రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానంటూ ఓ పోరాటం మొదలుపెట్టారు. అసలు డీఎంకే మీద ‘డీఎంకే ఫైల్స్’ అని శీర్షిక మొదలుపెట్టి అవినీతిని బయటపెట్టారు. అన్నాడీఎంకే అవినీతిలో డీఎంకేతో పోటీపడుతోంది. రెండు పార్టీలు అంతే..
సామాన్య జనం గొంతుక అన్నామలై గెలవాలి అని తమిళ ప్రజల అభిలాషపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.