Mamata Banerjee కోల్ కతా వీధులు రణరంగంగా మారిపోయాయి. ఇటీవల కాలంలో ఇంతటి పెద్ద ఉద్యమాన్ని ఎక్కడా చూడలేదు. భారత్ లో ఇంతటి పెద్ద ఆందోళన ఎక్కడా జరగలేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు కదం తొక్కి కోల్ కతా వీధుల్లోకి వచ్చి పోలీసులకే భయాన్ని సృష్టించారు. మమతా బెనర్జీ మొత్తం సెక్యూరిటీని కోల్ కతాలో దించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోల్ కతా లో వైద్యురాలి హత్యాచారం విషయంలో మమతా బెనర్జీ కవర్ చేసే ప్రయత్నమే ప్రజల్లో ఆగ్రహానికి గురిచేసింది. ప్రిన్సిపాల్ ను అక్కడి నుంచి వేరే కాలేజీకి బదిలీ చేయడం.. నిందితులను రక్షించే ప్రయత్నం చేయడమే ఈ వ్యవహారంలో ప్రజల ఆగ్రహానికి కారణమైంది.
క్రైం సీన్ తుడిచివేయడానికి.. బయట నుంచి తుడిచేయడానికి వ్యక్తులను తీసుకురావడం.. నిందితులను రక్షించే ప్రయత్నం చేయడం ప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది.
మమతా రాజకీయం చరమాంకానికి చేరిందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.