GHMC expansion: తెలంగాణ కేబినెట్ నిన్న ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్నింటిని కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించారు. మంత్రి శ్రీధర్ బాబు ఈ మేరకు ప్రకటించారు.
ఈ విలీనం అయ్యే మేడ్చల్ జిల్లాలో 13 ఉన్నాయి.. రంగారెడ్డిలో 11, సంగారెడ్డి జిల్లాలో 3 ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద బృహత్ నగరంగా మార్చుతామని అంటున్నారు. దీన్ని ఎన్ని కార్పొరేషన్లుగా మారుస్తారన్నది డిసైడ్ చేయలేదని అంటున్నారు.
ఈ ప్రతిపాదన చాలా సంవత్సరాలుగా ఉంటుంది. విలీనం పూర్తయ్యాక ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తారు? జీహెచ్ఎంసీ పదవీ కాలం వచ్చే ఫిబ్రవరితో ముగుస్తుంది. అనంతరం ఈ 27 పట్టణాలను విలీనం చేయడానికి చట్టసవరణ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాతనే ఎన్నికలు ఉంటాయి. జీహెచ్ఎంసీ, ఈ 27 మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉంటాయని తెలిపారు.
ఈ 27 మున్సిపాలిటీల పరిస్థితి ఏంటి? ఇందులో కొన్ని కొత్తవి, ఎక్కువ భాగం జనవరి 2025 నాటికే కాలపరిమితి అయిపోయింది. ఇప్పటికే పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా వాయిదా వేస్తామని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో జరుగవు అన్నట్టే..
విలీనం ముసుగులో హైదరాబాద్ చుట్టు పక్కల మున్సిపాలిటీల ఎన్నికల వాయిదాకు కుట్ర.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.