Peddi movie updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సినిమా మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఒక సినిమా మ్యూజికల్ గా సక్సెస్ ని సాధిస్తే సినిమా ఈజీగా భారీ విజయాన్ని సాధిస్తుందని మనందరికి తెలిసిన విషయమే…ఇక ఆస్కార్ అవార్డు గ్రహీతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఏఆర్ రెహమాన్ సైతం చాలా సినిమాలకు గొప్ప మ్యూజిక్ ని అందించాడు. ఆయన మ్యూజిక్ కి తెలుగులో కూడా వీరాభిమానులున్నారు. రజినీకాంత్ రోబో,ఐ సినిమా తర్వాత ఆయన చేసిన ‘సహసమే శ్వాసగా సాగిపో’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేసిన ‘పెద్ది’ సినిమాకి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.
కాబట్టి మొదటి తెలుగు దర్శకుడి సినిమాకి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండడం విశేషం… ఇక ఈ సినిమా చూస్తే మనకి తెలుగులో మంచి డిమాండ్ పెరుగుతోంది. తెలుగు సినిమా హీరోలకు ఆయన అందించిన మ్యూజిక్ అంత పెద్దగా వర్కౌట్ కాలేదు… అందుకోసమే అతనికి తెలుగులో అంత పెద్దగా క్రేజ్ లేదు.
ఇక రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి తనకు గొప్ప ఇమేజ్ ను అందిస్తుందని రెహమాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది…పెద్ది మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ గాని, చికిరి సాంగ్ కి ఆయన ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా హైలెట్ అయింది… ఆ ఊపులోనే నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కి కూడా ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చినట్లయితే ఆయన టాప్ లెవల్ కి వెళ్తాడు…
అలాగే మిగతా తెలుగు దర్శకులు సైతం ఆయనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది…అలా కాకపోతే మాత్రం ఆయన చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉండవచ్చు… చూడాలి మరి పెద్ది సినిమాతో రెహమాన్ తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది…