Terrorism in Telangana: పహల్గాం లాంటి సంఘటనలు జరిగినప్పుడు అత్యంతగా చలించిపోతాం.. చాలా మందికి తెలియనిది ఏంటంటే.. అలాంటి సంఘటనలు జరుగకుండా ముందే మన ఇంటెలిజెన్స్ చేధిస్తుంటుంది. దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియా వివరంగా ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేయదు. తీవ్రవాదులు ఏదైనా చేసినప్పుడు.. దారుణం జరిగినప్పుడు దాని గురించి మీడియా ఊదరగొడుతుంది.
ఢిల్లీ పోలీసులు నిన్న తెలంగాణలో ఇస్లామిక్ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. ఈ తరహాలో గుజరాత్ లో అల్ ఖైదా మాడ్యూల్ ను భగ్నం చేశారు. తెలంగాణ సహా దేశ మంతా వీరి నెట్ వర్క్ బయటపడింది.
జిహాద్ గ్రూపులుగా ఏర్పడ్డ 11 మందిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో కింగ్ పిన్ ‘అశార్ డానిష్’ రాంఛీలో పట్టుకున్నారు. మిగతా నలుగురులో ఇద్దరిని ఢిల్లీలో, జార్ఖండ్, నిజామాబాద్ బోధన్ లో ఒకరిని పట్టుకున్నారు. ఇంకా అరెస్ట్ కావాల్సిన వారున్నారు.
మనదగ్గర దీని గురించి వివరంగా చర్చించే అవకాశం లేదు. పనికిరాని విషయాల మీద చర్చిస్తారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల మీద మేధావులు, యాంకర్లు అసలు చర్చించరు. తెలంగాణలో ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోంది.
ఉగ్రవాదులకు అడ్డాగా తెలంగాణ అయినా నోరువిప్పని మేధావులు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.