PM Sri schools : పీఎం శ్రీ స్కూల్స్.. పబ్లిక్ స్కూల్స్ అధ్వాన్నంగా ఉంటున్నాయి. అందరూ ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచాలనే ధృఢ నిశ్చయంతో 2022లో కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. పీఎం శ్రీ స్కూళ్లు అని ఒక పథకాన్ని తీసుకొచ్చింది.
నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీలో భాగంగా.. మేధావులు ఇచ్చిన గైడ్ లైన్స్ తో ఈ పబ్లిక్ స్కూళ్లను తయారు చేయాలని కేంద్రం యోచించింది. ఇందులో భాగంగా అధునాతన పద్ధతుల్లో బోధన.. కనీస వసతులు మెరుగుపరచాలి. ఈ రెండింటిని సమన్వయం చేసినప్పుడే ప్రభుత్వ స్కూళ్లు బాగుపడుతాయి.
ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా స్కూళ్ల పద్ధతులు స్టడీ చేసి చిన్నప్పటి నుంచే స్కిల్ బేస్డ్ విద్యాబోధన చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ క్లాస్ తీసుకొస్తున్నారు. ల్యాబ్స్ ఫుల్లీ ఎక్విప్డ్.. క్రీడా మైదానాలు సౌకర్యాలు.. ఈ ప్రధాన ఉద్దేశంతోనే ‘పీఎం శ్రీ స్కూల్స్’ ప్రవేశపెట్టింది. ఇందుకోసం 27వేల కోట్ల ఖర్చు చేయనుంది. 18 వేల కోట్లు కేంద్రం, 9వేల కోట్లు రాష్ట్రాలు పెట్టనున్నాయి.

మొదటి దఫాలో 14వేల స్కూళ్లలో అమలు చేయాలని అనుకున్నారు. 13 వేల స్కూళ్లలో 2027 నుంచి మొదలుపెట్టనుంది. 33 రాష్ట్రాలు ఇందులో చేరాయి. కొత్తగా కేరళ అక్టోబర్ 23వ తేదీన సంతకాలు చేశాయి. మిగిలిపోయిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు మాత్రమే ఈ స్కూళ్లకు ఎంవోయూ కుదుర్చుకోలేదు.
పీఎం శ్రీ స్కూళ్ళపై సీపీఎం తలోదారి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.