West Bengal : రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు , ఎంపీ సుకుంత మజుందార్.. కేంద్రంలో సహాయ మంత్రి కూడా.. ఈశాన్య వ్యవహారాలకు సహాయ మంత్రిగా చేస్తారు. ఈయన ప్రధాని మోడీని కలిశారు. కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. అదేంటంటే..
ఉత్తరప్రాంత బెంగాల్ ను ఈశాన్య భారత రీజియన్ లో కలపాలని మోడీని ఈ ఎంపీ సుకుంత కోరారు. బయటకు వచ్చి ఒక ప్రకటన ఇచ్చాడు. ఈశాన్య భారతంలో ఉత్తర ప్రాంత బెంగాల్ ను కలుపుతూ అది పశ్చిమ బెంగాల్ లోనే ఉంచాలని కోరారు.
ఇప్పటికే రెండు సార్లు జరిగిన బెంగాల్‌ను మూడోసారి కూడా విభజిస్తారన్న చర్చ జరగుతోంది. అయితే ఈసారి మతం ప్రాతిపదికన కాకుండా, భౌగోలిక పరిస్థితుల ఆధారంగా విభజించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విభజన ఆలోచన మరోమారు తెరపైకి వచ్చింది. అయితే బెంగాల్‌ను విభజిస్తే ఎలా విభజిస్తారు. అందుకు కారణాలు ఏమిటి అన్న చర్చ కూడా బెంగాల్‌లో విస్తృతంగా జరుగుతోంది. పాలనా సౌలభ్యం కోసం, సరిహద్దు వివాదాలు పరిష్కరించే అవకాశం విభజనతో కలుగుతుందని భావిస్తున్నారు.
ఇక బెంగాల్ విభజన అంశం కొత్తది కాదు. అయితే గత రెండు విభజనలకు భిన్నంగా ఈసారి విభజన చేయాలని నార్త్, సౌత్ బెంగాళీలు కోరుతున్నారు. భౌగోళికంగా బెంగాల్ టీ తోటలు, సహజ వనరులు, ఖనిజాలు, కొండలు, విదేశాలతో నార్త్ బెంగాల్ సరిహద్దు కలిగి ఉంది. దేశ రక్షణకు ఇది కీలక ప్రాంతం .దీంతో తమను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని సౌత్ బెంగాలీలు కోరుతున్నారు. బ్రిటిష్ పాలకులు కూడా నార్త్ బెంగాల్‌ను ప్రత్యేకంగా పాలించారు. వాస్తవానికి బెంగాల్ మొత్తం దక్షిణ బెంగాల్‌లోని కోలకత్తా కేంద్రంగానే అభివృద్ధి జరిగింది బెంగాల్‌లో పరిశ్రమలన్నీ కోల్‌కత్తా చుట్టూ వెలిశాయి. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, పరిపాలన తదితర అంశాల్లో దక్షిణ బెంగాల్‌లో మెరుగ్గా ఉన్నాయి. అందుకే నార్త్ బెంగాళీలు తమను వేరుగా గుర్తించాలని కోరుతున్నారు.
బీజేపీ బెంగాల్ అధ్యక్షుడి మాటల్ని సమర్ధించిన సీపీఎం.. బెంగాల్ విభజనపై ‘రామ్’ గారి విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.