https://oktelugu.com/

India vs China : భారత్ పై చైనా కుట్రలో భాగమే మరో ఉగ్రవాద సంస్థకు అంకురార్పణ

India vs China: భారత్ పై చైనా కుట్రలో భాగమే మరో ఉగ్రవాద సంస్థకు అంకురార్పణ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : February 19, 2025 / 06:21 PM IST

India vs China : చైనా, భారత్ కు వ్యతిరేకంగా కంటిన్యూగా కుట్రలు చేస్తూనే ఉంది. 60ల్లో నక్సలిజం పేరుతో భారత్ కు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని రెచ్చగొట్టింది. 70ల్లో నాగాలకు ఆయుధాలు ఇచ్చి రెచ్చిగొట్టింది. 80ల నుంచి మణిపూర్ లో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టి భారత్ ను అతలాకుతలం చేస్తోంది.

ఇప్పుడు భారత్ ను దెబ్బతీయాలని నీటి యుద్ధానికి తెరతీసింది. బ్రహ్మపుత్ర నదిపై డ్యాం కడుతూ కొత్త కుట్రకు తెరతీసింది. చైనాలో దీన్ని నిర్మిస్తున్నారు. భారత్ లోకి ప్రవేశించే వంపు వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంను నిర్మిస్తూ భారత్ కు నీటి కొరత, నీటి వరదను కంట్రోల్ చేసేందుకు కుట్ర చేస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ లో చైనా కుట్రను ఛేదించేందుకు ప్రతిగా ఒక పెద్ద డ్యాం కడుతోంది. సీయామ్ మల్టీపర్సస్ డ్యాంను కడుతోంది. వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి భారత్ సంకల్పించింది. చైనా వరదను నియంత్రించేందుకు భారత్ ఈ ప్లాన్ చేస్తోంది. దీన్ని చైనా జీర్ణించుకోవడం లేదు.

దీన్ని ఆపేందుకు అరుణాచల్ ప్రదేశ్ లో ఒక కొత్త ఉగ్రవాద సంస్థను చైనా సృష్టించింది. కొత్తది కాదు ఇదీ.. దీన్ని తట్టి లేపి చైనా ప్రోత్సహిస్తోంది.

భారత్ పై చైనా కుట్రలో భాగమే మరో ఉగ్రవాద సంస్థకు అంకురార్పణ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

భారత్ పై చైనా కుట్రలో భాగమే మరో ఉగ్రవాద సంస్థకు అంకురార్పణ || China conspiracy against India