produced by Vallabhaneni Vamsi
Vallabhaneni Vamshi : గత వారం రోజుల నుండి వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi) పేరు నేషనల్ లెవెల్ లో ఎలా ట్రెండ్ అవుతుందో మనమంతా చూసాము. గన్నవరం నియోజకవర్గంలో అత్యంత పవర్ ఫుల్ లీడర్ గా పిలవబడే వల్లభనేని వంశీ, 2014 మరియు 2019 సార్వత్రిక ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరుపున పోటీ చేసి అసెంబ్లీ ని ఎన్నికైన సంగతి తెలిసిందే. కానీ టీడీపీ పార్టీ గుర్తు మీద గెలిచినప్పటికీ, ఆ పార్టీ కి వ్యతిరేకంగా మారి, వైసీపీ పార్టీ కి సపోర్టుని ఇస్తూ ఆయన గత ఐదేళ్లుగా నడిపిన రాజకీయాలు ఎలాంటివో మనమంతా చూసాము. చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి పై అత్యంత దారుణమైన కామెంట్స్ చేసి, చంద్రబాబు ని సైతం మీడియా ముందుకొచ్చి ఏడ్చేలా చేసిన వ్యక్తి ఆయన. అంతే కాకుండా తెలుగు దేశం పార్టీ గన్నవరం కార్యాలయం పై తన మనుషులను తీసుకెళ్లి దాడి చేయించి సంచలనం సృష్టించాడు ఆరోజుల్లో.
2024 వ సంవత్సరం లో వైసీపీ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన వల్లభనేని వంశీ, మళ్ళీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేదు. ఆయనపై టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసినందుకు FIR నమోదు అయ్యింది. పోలీసులు అతని గురించి తీవ్రంగా గాలించారు, కానీ ఆచూకీ దొరకలేదు. ఇంతలోపే హై కోర్టు నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, సాక్ష్యం చెప్పిన వ్యక్తిని కిడ్నాప్ చేసి అతను వేసిన కేసుని వెనక్కి తీసుకునేలా చేయడం వంటి సంఘటనలు ఇటీవల కాలం లో పెను దుమారం రేపాయి. పోలీసులు పక్కా ఆధారాలతో హైదరాబాద్ లో తల దాచుకొని ఉన్న వంశీ అరెస్ట్ చేసారు. ఇతని అరెస్ట్ పై తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎంతలా సంబరాలు చేసుకున్నారో మనమంతా చూసాము. నిన్ననే జగన్ పోలీస్ స్టేషన్ లో వంశీ ని కలిసి, ఆయన మీడియా ముందు చేసిన కామెడీ ని కూడా మనమంతా చూసాము.
అలా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వల్లభనేని వంశీ పేరే కనిపిస్తుంది. నెటిజెన్స్ ఈయన గురించి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా, ఈయన తన స్నేహితుడు కొడాలి నాని తో కలిసి పలు సినిమాలు కూడా నిర్మించాడని తెలిసిందే. 2009 వ సంవత్సరం లో ‘పున్నమినాగు’ అనే చిత్రం ద్వారా వీళ్ళ సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో వీళ్లిద్దరు కలిసి నిర్మించిన అదుర్స్ చిత్రం కమర్షియల్ గా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రెండు సినిమాల తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చే, 2018 వ సంవత్సరం లో మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Raviteja) తో వీళ్లిద్దరు కలిసి ‘టచ్ చేసి చూడు’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అలా కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి సినిమాలను నిర్మించారు.