https://oktelugu.com/

Annamalai : త్రిభాషా విధానం కోసం ఉద్యమిస్తా నన్న అన్నామలై

Annamalai: త్రిభాషా విధానం కోసం ఉద్యమిస్తా నన్న అన్నామలై పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : February 18, 2025 / 02:58 PM IST

Annamalai :తమిళనాడులో ద్రవిడ పార్టీలు తిరిగి ‘యాంటీ హిందీ యాజిటేషన్’ను మొదలుపెట్టాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారం షురూ చేశాయి. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తమిళనాడు వెళ్లినప్పుడు ఒక ప్రకటన చేశారు. ‘మీరు పీఎం శ్రీ స్కూల్స్ నడిపించకపోతే నిధులు ఆపేస్తాం’ అని ప్రకటించారు. పీఎం శ్రీ పథకంలో కేంద్రమే నిధులు సమకూరుస్తుంది. ఇందులో స్కూల్లు తెరిస్తే రాష్ట్రాలపై భారం పడదు.

న్యూ ఎడ్యూకేషన్ పాలసీలో త్రి లాంగ్వేజ్ పాలసీని అమలు చేయాలి. హిందీ రాష్ట్రాలు ఇంగ్లీష్, హిందీతోపాటు మూడో భాషను ఎంపిక చేయాలి. అలాగే తమిళనాడు వంటి వారు ఇంగ్లీష్, తమిళంతోపాటు మూడో భాషను ఎంపిక చేయాలి.

దీని మీద తమిళనాడు పార్టీలు భగ్గుమన్నాయి. ద్రవిడ పార్టీలు అన్నీ కలిపి ముప్పేట దాడి చేశాయి. 1930 నుంచే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాలు సాగాయి. ఎన్డీఏలోని పీఎంకే పార్టీ కూడా వ్యతిరేకించింది.

కానీ నిన్న అన్నామలై ఈ వివాదంపై చేసిన వీడియో వైరల్ అయ్యింది. వీళ్లందరూ ఒక నిరక్ష రాస్యులుగా మాట్లాడుతున్నారని ఆయన చరిత్రను చెబుతూ రిలీజ్ చేసిన వీడియో సంచలనమైంది. గణాంకాలతో సహా వివరించాడు.

త్రిభాషా విధానం కోసం ఉద్యమిస్తా నన్న అన్నామలై పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

త్రిభాషా విధానం కోసం ఉద్యమిస్తా నన్న అన్నామలై || Annamalai || Three Language Policy || Tamil Nadu