chanakya-niti
Chanakya Niti: అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రానికి సంబంధించిన విషయాలే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను ప్రజలకు అందించారు. దేశంలో ఎంతోమంది మేధావులు ఉన్న చాణక్య నీతి ప్రకారం జీవితాన్ని నడిపిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే చాలామంది చాణక్య నీతిని ఫాలో అవుతూ ఉంటారు. చాణక్య నీతి ప్రకారం మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది? వారితో ఎలా ఉండాలి? అనేది తెలుపుతుంది. వీటిలో ముఖ్యంగా పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి? వారి ముందు ఎలాంటి పనులు చేయాలి? అనే విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చేసే కొన్ని పనుల వల్ల పిల్లల భవిష్యత్తు పై ప్రభావం పడుతుంది. అయితే ఎలాంటి పనులను తల్లిదండ్రులు చేయకూడదో తెలుసుకుందాం..
కొంతమంది తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. విచ్చలవిడిగా అబద్ధాలు చెబుతూ ఉంటారు. అయితే వారి పిల్లల ముందు ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల తాత్కాలికంగా వారు పెద్దగా ప్రభావం ఉండదని అనుకుంటారు. కానీ భవిష్యత్తులో వారి పిల్లలు కూడా అబద్ధాలు చెప్పే వ్యక్తులుగా మారిపోతారు. ఇది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపి చిన్న భిన్నంగా మారుతుంది. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల ముందు అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. ఒకవేళ అబద్ధాలు చెప్పాల్సి వస్తే ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరించాలి.
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ముందు గొడవ పడుతూ ఉంటారు. ఈ సమయంలో కొందరు అసభ్యకర భాషను వాడుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు వాడే భాషనే పిల్లలు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. వారి పిల్లల ముందు ఎలాంటి భాషను మాట్లాడతారో వారి పిల్లలు కూడా బయట ప్రదేశంలో కూడా అలాగే మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. ఏదైనా అవసరం ఉండి లేదా కోపం వచ్చిన సందర్భాలు ఉంటే పిల్లలు వెళ్ళాక మాట్లాడుకోవాలి. లేకపోతే పిల్లల భవిష్యత్తు అసభ్యకరంగా మారుతుంది.
సమాజంలో గౌరవం అనేది ఇచ్చుపుచ్చుకోవాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలి. అందుకోసం భార్యాభర్తలు ఇద్దరు పిల్లల ముందు గౌరవించుకోవాలి. అలా చేయడం వల్ల వారిపై కూడా పిల్లలకు గౌరవం పెరుగుతుంది. దీంతో వారు భవిష్యత్తులో ఇతరులను గౌరవించేందుకు ప్రయత్నిస్తారు. అలా కాకుండా వారి ముందు అగౌరవంగా మాట్లాడుతూ.. గౌరవంగా ప్రవర్తించడం వల్ల పిల్లలు అలాగే మారిపోయే అవకాశం ఉంది. అందువల్ల తల్లిదండ్రులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు విలువ తెలపాలి. కానీ ఎంత డబ్బు ఉంది ఏం చేస్తున్నామనే విషయాలు పూర్తిగా తెలియనివ్వకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో వారు తమకు ముందే ధనం ఉందనే ఆశతో ఉంటారు. కొందరు డబ్బు ఎక్కువగా చూడడం వల్ల వారు లగ్జరీ లైఫ్ ను కావాలని కోరుకుంటారు. దీంతో ఏ పని చేయడానికి ముందుకు రారు. అందువల్ల పిల్లల విషయంలో డబ్బు ఎక్కువగా కనిపించకుండా వారికి మనుషుల విలువలను తెలపాలి. అలాగే కష్టపడితేనే జీవితం అనే విధంగా ప్రవర్తించాలి. పిల్లలకు మొదటి గురువును తల్లిదండ్రులే. అందువల్ల తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి పిల్లలు మారుతారని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.