Homeటాప్ స్టోరీస్Bihar Assembly Election 2025: బీహార్ ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తి, ఏ పార్టీ ఎలా?

Bihar Assembly Election 2025: బీహార్ ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తి, ఏ పార్టీ ఎలా?

Bihar Assembly Election 2025: బీహార్ ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తయ్యింది. నామినేషన్ లో ఏ పార్టీ అభ్యర్థులు ఎవరన్నది తేలింది. ఎన్డీఏ త్వరగా డీల్ కుదుర్చుకుంది. తొందరగా అభ్యర్థులను ప్రకటించింది. మహా గట్ బంధన్ తేజస్వి యాదవ్ సీట్ల కేటాయింపు చాలా ఆలస్యమైంది. కాంగ్రెస్ తో ఆర్జేడీ పొత్తు సరిగ్గా కుదరక కొన్ని చోట డబుల్ పోటీ నెలకొంది.

ఇక జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ 243 మంది అభ్యర్థులను పోటీ పెట్టి 3 మానుకున్నారు. 240 సీట్లలో పోటీకి దిగింది. క్యాండిడేట్ల సెలక్షన్ చూస్తే.. తేజస్వి యాదవ్ క్యాండిడేట్ సెలక్షన్ బాగుందని చెబుతున్నారు. 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 34 మందిని మార్చారు. ఏ పార్టీ ఇవ్వనంత సీట్లు మహిళలకు ఆర్జేడీ ఇచ్చింది.

నోటారియాస్ గ్యాంగ్ స్టార్ కొడుక్కి ఆర్జేడీ టికెట్ ఇచ్చింది. బీజేపీ 74 మంది ఎమ్మెల్యేల్లో 1/3 మార్చారు. ఈ రెండూ ప్రధాన పార్టీలు. బీహార్ లో సామాజిక కోణం చూస్తే.. ఆర్జేడీ యాదవులకు అగ్రతాంబూలం ఇచ్చింది. 53 సీట్లు ఇచ్చింది. బీజేపీ 50 శాతం అగ్రవర్ణాలకు ఇచ్చింది. జనతాదల్ నితీష్ కుమార్ పార్టీ ఈబీసీలకు అగ్రపీఠం వేసింది.

కాంగ్రెస్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.. ఈబీసీలకు ఎక్కువ సీట్ల ఇస్తామని మోసం చేసింది. అగ్రవర్ణాలకే ఎక్కువ సీట్లు ఇచ్చింది.

బీహార్ ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తి, ఏ పార్టీ ఎలా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular