Homeఅంతర్జాతీయంAmerica economic growth: అమెరికా ఆర్థిక వృద్ధిలో భారతీయులే కీలకం.. తాజా అధ్యయనంలో కీలక అంశాలు!

America economic growth: అమెరికా ఆర్థిక వృద్ధిలో భారతీయులే కీలకం.. తాజా అధ్యయనంలో కీలక అంశాలు!

America economic growth: ఇండియా లేకుంటే.. అమెరికా లేదు.. రెండు దశాబ్దాల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ అన్నమాటలు ఇవి. అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్రను గుర్తించి చేసిన వ్యాఖ్యలు ఇవీ. తర్వాత వచ్చిన పాలకులు కూడా ఇంత ఓపెన్‌ కాకపోయినా భారతీయులకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. భారత సంతతికి చెందినవారికి కీలక పదవులు కట్టబెట్టారు. తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌ తన 2.0 పాలనలో కూడా భారత సంతతికి చెందినవారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక అమెరికాలో అత్యాధునిక సాంకేతికత, ఆరోగ్య సేవలు, వ్యాపార రంగాల్లో భారతీయ వలసవాసుల పాత్ర అమెరికా ఆర్థికవ్యవస్థకు బలాన్నిస్తోంది. తాజా పరిశోధన ప్రకారం ఇండియన్‌ మూలాల వలసదారులు అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి ఇతర దేశాల వలసదారుకన్నా అత్యధిక ఆర్థిక లాభాన్ని తెచ్చిపెడుతున్నారు.

30 ఏళ్లలో గరిష్ట లాభం
తాజా అధ్యయనం తెలిపిన ప్రకారం, ఒక్కో భారతీయ వలస కుటుంబం, వారి సంతానం మూడున్నర దశాబ్దాల్లో సగటున 1.7 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.14 కోట్లు) మేర ప్రభుత్వానికి నికర లాభాన్ని అందించింది. ఇది ఇతర వలస జనాభా గుంపులతో పోలిస్తే చాలా ఎక్కువ. చైనా వలసదారులు 900,000 డాలర్లు, ఫిలిప్పీన్స్‌ వాసులు 650,000 డాలర్లు, కొలంబియా వాసులు 500,000 డాలర్లు, వెనిజులా వాసులు 400,000 డాలర్లు, డొమినికన్‌ రిపబ్లిక్‌ వలస వాదులు 200,000 డాలర్లు, క్యూబా వలసవాదులు 150,000 డాలర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వలసదారులు చెల్లించిన పన్నుల నుంచి వారు పొందిన ప్రజా సేవలు, సబ్సిడీలను తగ్గించిన తర్వాత లభించిన నికర ఆర్థిక ప్రయోజనాన్ని ఈ లెక్కలు సూచిస్తున్నాయి.

విజ్ఞానం, నైపుణ్యం, కృషి..
భారతీయులు అమెరికాలో టెక్నాలజీ, మెడిసిన్, ఫైనాన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వంటి రంగాల్లో ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్నారు. అత్యధిక విద్యార్హతలు, ఉన్నత వృత్తి నైపుణ్యాలు, దీర్ఘకాల స్థిరత వీరిని ఫిస్కల్‌ అసెట్‌గా నిలిపాయి. అనేక సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌లలో భారత్‌ మూలం ఉన్న వ్యక్తులే స్థాపకులు కావడం, వేలాది మంది డాక్టర్లు, ఇంజినీర్లు, పరిశోధకులు అమెరికా సామాజిక మూలధనాన్ని బలోపేతం చేయడం ఇందుకు స్పష్టమైన ఉదాహరణ.

ఇమ్మిగ్రేషన్‌ విధానాల ఫలితం
ఈ లెక్కలు అమెరికా వలస విధానాల అమలు ఫలితాలను ప్రతిబింబిస్తున్నాయి. ఉన్నత నైపుణ్యం గల ప్రజలను ఆకర్షించే విధానాలు అమెరికా ఆర్థిక శక్తిని పెంచాయి. భారతీయ వలసదారులు అందులో ప్రముఖ పాత్ర పోషించారు. సామాజిక మాధ్యమాల్లో వలసదారులపై ఉన్న అపార్థాలను ఈ డేటా ఖండిస్తోంది.

ఈ అధ్యయనం ప్రకారం, భారతీయ వలస సమాజం ఒక్క ఆర్థిక వనరుగా మాత్రమే కాదు, అమెరికా సాంస్కృతిక, శాస్త్రీయ, వ్యాపార ప్రగతిలో కీలక భాగస్వామిగా అవతరించిందని స్పష్టం అవుతోంది. మూడు దశాబ్దాల వ్యవధిలో ఒక్క కుటుంబం స్థాయి నుంచి కూడా ప్రభుత్వం బిలియన్ల డాలర్ల ఆదా సాధించడం భారత వలసదారుల ప్రాధాన్యానికి నిదర్శనం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular