Ram Talk : నిన్న అమరావతికి అదానీ గ్రూప్ కు చెందిన ఇద్దరు ఎండీలు.. వారిద్దరూ అదానీ కొడుకులు విచ్చేశారు. వీరిద్దరూ సీఎం చంద్రబాబు నాయుతో విస్తృత మంతనాలు జరిపారు. వారు ఆంధ్రప్రదేశ్ కు ఓ బ్లూ ప్రింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతికి రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామన్నారు. బీచ్ సాండ్ మైనింగ్ కు పర్మీషన్ ఇవ్వాలని కోరారు. శ్రీకాకుళం, భీముని పట్నం దగ్గర అనుమతి ఇవ్వాలని అడిగారు. టైటానియం డైయాక్సైడ్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. దానికి కావాల్సిన రాయితీలు ఏంటో అడిగారు.
అందుకు ప్రతిగా అదానీ కంపెనీ ప్రతినిధులు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, హోటల్స్ నిర్మిస్తాం, పేదలకు ఉపయోగపడే విధంగా ఎడ్యూకేషనల్ స్కూల్స్ కడతామని హామీ ఇచ్చారు. టూరిజం సెక్టార్ కింద విజయవాడ వయా భవానీ ద్వీపానికి రోప్ వే నిర్మిస్తామని చెప్పారు. కృష్ణ పట్నం, గంగవరం పోర్టులను విస్తరిస్తామన్నారు. అందుకు ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం 78మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్న కృష్ణ పట్నాన్ని 300మిలియన్ మెట్రిక్ టన్నులకు, 64మిలియన్ మెట్రిక్ టన్నులున్న గంగవరాన్ని 200మిలియన్ మెట్రిక్ టన్నులకు విస్తరిస్తామని గౌతమ్ అదానీ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దానితో పాటు పారిశ్రామిక మార్పులకు కూడా శ్రీకారం చుడతామన్నారు.
తర్వాత డీసాలివేషన్ ప్లాంట్ ను వైజాగులో నిర్మిస్తామన్నారు. ఐటీ, టూరిజం, ఏఐ వంటి కీలక రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించే ప్రాజెక్టుల ఏర్పాటుపై వారు సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు. అమరావతి పునర్ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని, స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ సాకారం చేసేందుకు తమవంతు సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఆంధ్రాలో మౌలిక సౌకర్యాల రంగంలో అదానీ పెట్టుబడుల ప్రతిపాదన గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.