Queen Elizabeth Car: బ్రిటిష్ పరిపాలకులు.. ఈపేరు వినగానే రవి అస్తమించని సామ్రాజ్యం అని గుర్తుకు వస్తుంది.. అలాంటి సామ్రాజ్యానికి ఆమె మహారాణి. పైగా ఆ సామ్రాజ్యానికి ఆమె కర్త, కర్మ, క్రియ. అలాంటి ఆమె అంటే బ్రిటిష్ సైనికులకు మాత్రమే కాదు బ్రిటిష్ ప్రజలకు కూడా భయమే.. “రాజు వెడలె…” సామెత తీరుగానే ఆ మహారాణి దర్పం ఉండేది. ఇంతకీ ఆ మహారాణి ఎవరో తెలుసా..క్వీన్ ఎలిజబెత్_2. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారిలో ఎలిజబెత్ కూడా ఒకరు. ఆమె పరమపదించిన నేపథ్యంలో.. ఆమె వాడిన కారు “లోరీ బ్లూ రేంజ్ రోవర్”ను బ్రేమ్ లీ అనే సంస్థ వేలానికి పెట్టింది. దీని ధర 2,24,850 పౌండ్లు ( రూ. రెండు కోట్లకు పైచిలుకు) గా నిర్ణయించింది..ఈ కారును ఎలిజబెత్ తన చివరి క్షణాల వరకు ఉపయోగించారు. ఈ కారుతో ఆమెకు విడదీయరాని బంధం ఉంది. ఎలిజబెత్ మాత్రమే కాకుండా రాజ కుటుంబ సభ్యులు 2016, 2017 ల్లో వివిధ కార్యక్రమాల కోసం ఈ కారును విరివిగా ఉపయోగించారు. రాజకుటుంబ సబ్యులకు మాత్రమే ఈ కారును తయారు చేసిన నేపథ్యంలో దీనికి ” ట్రూ లాండ్ యచ్” అని పేరు పెట్టారు.
ఎలిజబెత్ బతికి ఉన్నప్పుడు ఈ కారును విరివిగా ఉపయోగించేవారు. అధికారిక కార్యక్రమాలకు ఎక్కువగా వాడేవారు.. అందుకే దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.. ఈ కారు కోసం కన్వర్ట్ లైటింగ్, ప్రత్యేకంగా రూపొందించిన ఫిక్స్డ్ స్టెప్స్, పోలీస్ ఎమర్జెన్సీ లైటింగ్, తేలికగా ఉండే ఉక్కు, ఇనుప సామాగ్రి ఉపయోగించారు. వాహనం సులువుగా నడిపేలా తయారు చేశారు. నలుపు వజ్రం, నలుపు లెదర్ తో ఇంటీరియర్, కార్బన్ ఫిబ్రే ట్రిమ్, బ్లాక్ బ్యాడ్జీ.. వంటి సదుపాయాలతో ఈ కారు రూపొందించారు. ఇవి మాత్రమే కారుకు ప్రత్యేక ఆకర్షణగా షూటింగ్ స్టార్ హెడ్ లైనర్, ఆర్ ఆర్ మోనో గ్రామ్స్ టు హెడ్ రె స్ట్స్, శరీరానికి హాయి ఇచ్చే మసాజ్ సీట్లు, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే అధునాతన గ్లాస్, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్.. వంటి సదుపాయాలు కూడా జోడించారు. అయితే ఈ సౌకర్యాలకు సంబంధించి వచ్చే నెలాఖరు వరకు వారంటీ ఉంటుంది.
ఎలిజబెత్_2 మరణించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కారును వేలానికి చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకు వేలానికి పెట్టారో తెలియక పోయినప్పటికీ.. వేలం ప్రకటన రావడంతో చాలామంది ఈ కారు దక్కించుకునేందుకు క్యూలో ఉన్నారు. ఎందుకంటే ఈ కారు కు కల్పించిన సదుపాయాలు, ఇతర ఉపకరణలు చాలా విలువైనవి. ఒకవేళ రోల్స్ రాయిస్ ప్రస్తుతం తయారు చేస్తున్న వాహనాలలో ఇలాంటి సదుపాయాలు కల్పించడం దాదాపు అసాధ్యమే. ఒకవేళ కల్పించినా కూడా ఈ స్థాయిలో నాణ్యంగా ఉంటాయనే నమ్మకం లేదు. చాలామంది ఈ కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. అన్నట్టు అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్నప్పుడు ఈ కారులో క్వీన్ ఎలిజబెత్_2 తో కలిసి ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ కుటుంబం ఆ దృశ్యాలను ప్రత్యేక గ్యాలరీలో ఏర్పాటు చేసింది. ఈ కారును వేలం వేస్తున్న సంస్థ కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. చాలామంది ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ కారు నిర్ణయించిన ధర రెండు కోట్లకు అమ్ముడుపోతుందా..? లేకుంటే ఎక్కువ ధర పడుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Queen elizabeths custom range rover for sale
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com