YSRCP MLC Anantha Babu: తన సొంత కారు డ్రైవర్ ను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన నియోజకవర్గంలో ఎంతలా అరాచకం సృష్టించాడో బయటపడుతున్నాయి. మన్యంలో దాదాగిరీ చేశాడని.. ఆయన అన్యాయాలపై బాధితులు ఒక్కరొక్కరుగా స్పందిస్తున్నారు. డ్రైవర్ హత్యతో అరెస్ట్ అయ్యి జైలుపాలైన ఎమ్మెల్సీని విచారిస్తున్న పోలీసులు షాకింగ్ నిజాలు రాబడుతున్నారు. హత్య ఎలా చేశాడు? ఎందుకు చేశాడు? ఎప్పుడు జరిగిందన్న విషయాలను తాజాగా కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.

ఈనెల 19న ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్య బయటకు వెళ్లి శ్రీరామ్ నగర్ లోని తన మిత్రులతో కలిసి మద్యం సేవించాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్సీ అనంతబాబు వచ్చాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కారులో తీసుకెళ్లాడు. అర్థరాత్రి డ్రైవర్ డెడ్ బాడీని అతడి ఇంటివద్దకు ఎమ్మెల్సీ తన కారులోనే తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఏం జరిగిందన్నది పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
Also Read: Alliance In AP: ఆంధ్రప్రదేశ్ లో మారనున్న పొత్తుల ఎత్తులు?
సుబ్రహ్మణ్యం పెళ్లి సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు కొంత డబ్బులు ఇచ్చాడని సమాచారం. తీసుకున్న డబ్బులు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతబాబు గుట్టు బయటపెడుతానని డ్రైవర్ సుబ్రహ్మణ్యం బెదిరింపులకు దిగి బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం ను ఎమ్మెల్సీ అనంతబాబు మందలించాడు. పద్ధతి మార్చుకోవాలన్నాడు.కానీ డ్రైవర్ తిరగబడ్డాడు. వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో ఎమ్మెల్సీ గట్టిగా డ్రైవర్ ను వెనక్కి నెట్టాడు. ఈ క్రమంలోనే డ్రైవర్ తలకు గాయమైంది. లేచిన సుబ్రహ్మణ్యం ఆవేశంతో అనంతబాబు మీదకు వచ్చాడు. మరోసారి వెనక్కి నెట్టడంతో గ్రిల్ కు తగిలి సుబ్రహ్మణ్యం తల నుంచి రక్తం కారడం మొదలైంది.
గాయపడిన సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు కారులో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలోనే డ్రైవర్ చనిపోవడంతో అనంతబాబు షాక్ అయ్యాడు. గతంలో మద్యం తాగి యాక్సిడెంట్ చేసిన సుబ్రహ్మణ్యం ఇష్యూలను బేస్ చేసుకొని ఎమ్మెల్సీ ఈ హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూశాడు. ప్రమాదంలా ఉండాలని సుబ్రహ్మణ్యం శరీరంపై కర్రతో కొట్టాడు. చనిపోయాక కూడా కర్రతో దాడి చేశాడు. దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు.

అనంతరం డ్రైవర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి యాక్సిడెంట్ జరిగిందని.. తాను ఆస్పత్రికి తీసుకెళుతున్నాని ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడారు. అనంతరం చనిపోయాడని ఇంటికి డెడ్ బాడీ తీసుకొచ్చాడు. అయితే అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో ఈ హత్య తానే చేసినట్టు ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్నాడు. అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కు పోలీసులు పంపారు.
Also Read:JanaSena Alone Fight: జనసేన ఒంటరి పోరుకు నాగబాబు స్కెచ్.. ఆయన వెనుక ఎవరున్నారు?
Recommended videos
[…] Also Read: YSRCP MLC Anantha Babu: డెడ్ బాడీని వదలని ఎమ్మెల్సీ … […]
[…] Also Read:YSRCP MLC Anantha Babu: డెడ్ బాడీని వదలని ఎమ్మెల్సీ … […]
[…] Also Read:YSRCP MLC Anantha Babu: డెడ్ బాడీని వదలని ఎమ్మెల్సీ … […]
[…] Also Read:YSRCP MLC Anantha Babu: డెడ్ బాడీని వదలని ఎమ్మెల్సీ … […]