Chiranjeevi Missed Basha Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన బాషా సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సురేష్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కేవలం తమిళం లో మాత్రమే కాదు..తెలుగు లో కూడా సంచలన విజయం సాధించి రజినీకాంత్ కి మన టాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ ని తీసుకొచ్చింది..అంతే కాదు,ఈ సినిమా ఓవర్సీస్ లో సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..ఒక్క మాటలో చెప్పాలి అంటే తమిళ సినిమా ఇండస్ట్రీ కి ఓవర్సీస్ మార్కెట్ ని తెచ్చిపెట్టిందే ఈ సినిమా..దాదాపుగా 15 నెలల పాటు థియేటర్స్ లో ఆడిన ఈ సినిమా,రెండేళ్ల క్రితం లో తమిళనాడు లో రీ రిలీజ్ చేసినా కూడా దుమ్ము లేపేసింది అంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..అయితే ఈ సినిమా తొలుత తెలుగు లో దబ్ చెయ్యాలనే ఆలోచన లేదు అట..సౌత్ లో రజినీకాంత్ కి సరిసమానమైన స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి తో ఈ సినిమా చెయ్యాలని అనుకున్నాడు అట డైరెక్టర్ సురేష్ కృష్ణ.

ప్రముఖ దర్శకుడు బాపినీడు గారితో మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో గ్యాంగ్ లీడర్ అనే సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..తన కెరీర్ ని మలుపు తిప్పే రేంజ్ హిట్ ని ఇచ్చిన దర్శకుడు బాపినీడు గారితో మరో సినిమా చెయ్యడానికి అంగీకరించి బిగ్ బాస్ సినిమా ఒప్పుకున్నాడు మెగాస్టార్..ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో బాషా సినిమా దర్శకుడు సురేష్ కృష్ణ చిరంజీవి ని కలిసి, ఈ సినిమాని తెలుగు లో మీరు చేస్తే అదిరిపోతోంది అని స్క్రిప్ట్ మొత్తం వినిపించాడు..కథ మొత్తం విన్నాక ఎంతో ఆనందించిన మెగాస్టార్ చిరంజీవి తన బావ అల్లు అరవింద్ ని పిలిపించి వెంటనే ఈ మూవీ రీమేక్ రైట్స్ ని కొనుగోలు చెయ్యమని చెప్పాడు..మెగాస్టార్ చెప్పడం తో ఈ సినిమా రీమేక్ రైట్స్ ని కొనడానికి బాషా సినిమా నిర్మాత రాజమ్మాళ్ తో బేరాలు పెట్టాడు అల్లు అరవింద్.

Also Read: Samantha Vijay Devarakonda: బ్రేకింగ్: నదిలో పడిపోయిన సమంత-విజయ్ దేవరకొండ కారు.. తీవ్ర గాయాలు!
ఈ సినిమా రైట్స్ ని 50 లక్షల రూపాయలకు అమ్మడానికి ఆ చిత్ర నిర్మాత సిద్ధంగా ఉన్నాడు,అప్పట్లో 50 లక్షల రూపాయిలు అంటే మాటలు కాదు..అల్లు అరవింద్ అంత మొత్తాన్ని ఇవ్వడానికి ఆసక్తి చూపించకుండా కేవలం పాతిక లక్షల రూపాయిలు మాత్రమే ఇవ్వగలను అని బేరం చేయడం తో బాషా సినిమా నిర్మాత రాజమ్మాళ్ అందుకు అంగీకరించలేదు..దీనితో ఇద్దరి మధ్య చర్చలు సఫలీకృతం కాకపోవడం తో ఈ సినిమా ని వదిలేసుకోవాల్సి వచ్చింది..అలా మెగాస్టార్ చిరంజీవి ఒక్క సెన్సషనల్ హిట్ సినిమాని వదులుకున్నాడు..బాషా సినిమా అప్పట్లో తెలుగు లో దాదాపుగా 8 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ఇంత కలెక్షన్స్ అప్పట్లో టాలీవుడ్ లో చిరంజీవి కి తప్ప మరో హీరో కి లేదు..ఆ స్థాయిలో విజయం సాధించిన ఈ సినిమా ని డబ్ చెయ్యకుండా మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసి ఉంటె ఆయన కెరీర్ లో ఒక్క మైలు రాయిగా నిలిచిపొయ్యే చిత్రం గా నిలిచేది అని ట్రేడ్ పండితుల అంచనా.
Also Read: JanaSena Alone Fight: జనసేన ఒంటరి పోరుకు నాగబాబు స్కెచ్.. ఆయన వెనుక ఎవరున్నారు?
Recommended videos
[…] […]
[…] […]
[…] […]