Homeఆంధ్రప్రదేశ్‌YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు: కోర్టులో ఆయన కూతురు సంచలన...

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు: కోర్టులో ఆయన కూతురు సంచలన వాదనలు

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ తనకు రెండు కళ్లు అని పేర్కొన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి లు ఆయన కూతురు వైఎస్ సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు కోర్టులో ఆమె చేసిన వాదనలు చర్చనీయాంశమయ్యాయి.  సునీత గతంలో డీజీపీని కలిశారు. ఆ సమయంలో సీఎం జగన్ తనకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి లు  రెండు కళ్లు అని చెప్పినట్లు సునీత 164 స్టేట్ మెంట్లో డీజీపీతో అన్నారు. అయితే దేవిరెడ్డికి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్ట్ అయ్యి మొదటి బెయిల్ కొట్టివేసిన తరువాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పులేదన్నారు. ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం అంత మంచిది కాదని వైఎస్ వివేకానంద హత్య కేసులో సునీత తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వివేకానంద హత్య కేసుపై సీరియస్ గా విచారణ సాగుతోంది. తాజాగా ఆయన కుమార్తె వేసిన పిటిషన్ పై సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ కేసులో దేవిరెడ్డి శివశంకర్ కీలకంగా ఉన్నారని, అతనికి బెయిల్ ఇవ్వొద్దని కోరారు. అతనికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అయితే దేవిరెడ్డి తరుపున న్యాయవాది మాట్లాడుతూ ఆరున్నర నెలలుగా దేవిరెడ్డి జ్యూడిషియల్ కస్టడీలోనే ఉన్నారని, ఈ నేపథ్యంలో అతడు బెయిల్ కు అర్హుడన్నారు. అయితే మరికొన్ని వాదనలు వినేందుకు కోర్టు నేటికి వాయిదా వేసింది. అంటే ఈ కేసుపై నేడు విచారణ సాగనుంది.

ఈ కేసు మొత్తంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కీలకంగా ఉన్నారని సునీత తరుఫున న్యాయవాది అన్నారు. వివేకానంద చనిపోయిన రోజు ఆ సంఘటనను గుండెపోటుగా చిత్రీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నించారన్నారు. అలాగే వివేకా మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఆ ఏడాది మే 26న బెయిల్ పై బయటకు రావడంతో పాటు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి సాక్షులను ప్రభావితం చేశారని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు తనను కలిశారని, ఈ సమయంలో సీబీఐ తనను వేధిస్తుందంటూ ఉదయ్ కుమార్ రెడ్డి కేసు పెట్టారన్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి మంచి మిత్రులని న్యాయవాది వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు.

ఈ వాదనలపై దేవిరెడ్డి తరుపున న్యాయవాది స్పందించారు. దేవిరెడ్డికి బెయిల్ పొందేందుకు అర్హుడని తెలిపారు. ఎందుకంటే గత ఆరు నెలలుగా ఆయన జ్యూడిషియల్ కస్టడీలోనే ఉన్నారన్నారు. ఆయనపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి దేవిరెడ్డిపై 5 కేసులు పెండింగులో ఉన్నాయన్నారు. అయితే మిగిలిన వారి వాదనలు వినేందుకు కోర్టు నేటికి వాయిదా వేసింది. అయితే నేటి వాదనలతో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version