https://oktelugu.com/

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు: సునీత, ఆమె భర్త ఊపిరిపీల్చుకున్నట్టే

  YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో కుమార్తె సునీత, భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాష్ రెడ్డిల ప్రమేయం లేదని సీబీఐ ప్రాథమికంగా నిర్థారించింది. వారికి సంబంధం ఉన్నట్టు ఎటువంటి సాక్షాధారాలు, రుజువులు లేవని సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. సోమవారం సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లోనూ వీటిపై స్పష్టంగా పేర్కొంది. అటు సుప్రీం కోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఇవే అంశాలను వెల్లడించింది. వైఎస్ భాస్కరరెడ్డి రిమాండ్ […]

Written By:
  • Dharma
  • , Updated On : April 25, 2023 / 12:12 PM IST
    Follow us on

     

    YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో కుమార్తె సునీత, భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాష్ రెడ్డిల ప్రమేయం లేదని సీబీఐ ప్రాథమికంగా నిర్థారించింది. వారికి సంబంధం ఉన్నట్టు ఎటువంటి సాక్షాధారాలు, రుజువులు లేవని సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. సోమవారం సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లోనూ వీటిపై స్పష్టంగా పేర్కొంది. అటు సుప్రీం కోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఇవే అంశాలను వెల్లడించింది. వైఎస్ భాస్కరరెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ ఇవే అంశాలను పునరుద్ఘాటించింది. ఇటీవల సీబీఐ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. వివేకా రెండో భార్య షమీమ్ వాంగ్మూలం, ఆమె ఇచ్చిన సమాచారంతోనే రాజశేఖర్ రెడ్డిని విచారిస్తున్నట్టు ప్రచారం సాగింది. అటు అవినాష్ రెడ్డి సైతం తరచూ రాజశేఖర్ రెడ్డిని అనుమానిస్తూ కామెంట్స్ చేసేవారు. రాజశేఖర్ రెడ్డి పాత్రపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారు. వాటన్నింటినీ తెరదించుతూ సీబీఐ సుప్రీం కోర్టుకు కేసు వివరాలను సమర్పించింది.

    షమీమ్ ఎంట్రీతో…
    కేసులో వివేకా రెండో భార్య షమీమ్ ఎంట్రీతో సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డి పాత్రపై ఒక రకమైన కారణాలు పెరిగాయి. తనతో వివాహం వారికి ఇష్టం లేదని.. తనను బెదిరించారని.. తన వారసుడికి ఆస్తి దక్కుతుందని భయపడ్డారని.. వివేకాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేశారని..ఇలా రకరకాల కారణాలు చూపుతూ షమీమ్ ఇచ్చిన వాంగ్మూలమంటూ మీడియాలో ప్రచారం హోరెత్తింది. అటు సీబీఐ విచారణలో సైతం షమీమ్ చెప్పిన వివరాలతో పులివెందులో మరోసారి విచారణ ప్రారంభించారని టాక్ నడిచింది. రాజకీయంగానే కాదు.. ఆర్థికపరమైన అంశాలు సైతం వివేకా హత్యకు పురిగొల్పాయన్న వార్తలు వచ్చాయి. దీంతో వివేకా కుమార్తె, అల్లుడు, ఆయన సోదరుడి ప్రమేయంపై అనుమానాలు పెరిగాయి. అయితే ఒక్క శివప్రకాష్ రెడ్డి షమీమ్ ను బెదిరించడం తప్ప..ఇందులో ఏ ఒక్కటీ నిజం లేదని సీబీఐ తేల్చేసింది. తమ దర్యాప్తులో సైతంఇదే తేలిందని సుప్రీం కోర్టుకు నివేదించింది.

    సీబీఐ క్లీన్ చీట్
    తాజాగా సీబీఐ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో ఇది రాజకీయ కుట్రలో జరిగిన హత్యగా నిర్ధారించింది. 2017 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటమికి భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డిలే కారణమన్న కోపం వివేకాలో ఉండేది. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు ఉండేవి. పేరుకే ఒకే పార్టీ కానీ వైషమ్యాలు అలానే కొనసాగేవి. వివేకా ఉంటే తమకు ఇబ్బందులు తప్పవని భావించి అడ్డుతొలగించుకోవడానికే హత్యను చేశారని సీబీఐ సుప్రీం కోర్టుకు స్పష్టంగా చెప్పింది. 2010లో వివేకా షమీమ్ ను పెళ్లిచేసుకున్నాడని.. దీనిపై బావమరిది శివప్రకాష్ రెడ్డి అభ్యంతరం తెలపడం వాస్తవమేనన్నారు. కానీ వివేకా హత్య కేసులో మాత్రం సునీతకు కానీ.. ఆమె భర్త రాజశేఖర్ రెడ్డికి కానీ.. శివప్రకాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని సీబీఐ పేర్కొనడం విశేషం.

    అంతా కుట్ర కోణమే..
    అయితే మొత్తం కేసులో కుట్ర కోణం తప్పించి మరో దానికి అవకాశమే లేదని సీబీఐ తన విచారణలో తేలినట్టు కోర్టుకు స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆది నుంచి కేసు విషయంలో మధ్యంతర పిటీషన్లు దాఖలవుతునే ఉన్నాయి. చివరకు నిందితులు,అనుమానితుల కుటుంబసభ్యుల తరుపున కూడా పిటీషన్లు దాఖలు చేశారు. ఇవన్నీ సీబీఐ విచారణను ప్రభావితం చేయడానికేనన్న టాక్ నడిచింది. అటు సీబీఐ సిట్ ల మీద సిట్ లు ఏర్పాటుచేస్తుండడంతో ఈ కేసు తేలే పని కాదన్నట్టు అంతా వ్యవహరించారు. అటు నిందితులు, అనుమానితులు సైతం లైట్ తీసుకున్నారు. ఇటువంటి తరుణంలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో నిందితుల్లో ఆందోళన పెరుగుతోంది. అదే సమయంలో తాము అనుమానిస్తూ వస్తున్న వివేకా కుమార్తె, అల్లుడుకు సీబీఐ క్లీన్ చీట్ ఇవ్వడం వారికి మింగుడుపడడం లేదు.