https://oktelugu.com/

YS Sunitha : సుప్రీంకోర్ట్ లో తన కేసు తనే వాదించుకుని చరిత్ర సృష్టించిన డా.వైఎస్ సునీత

స్వతహాగా వైఎస్ వివేకా కూతురు డాక్టర్. అయినా నిన్న తన కేసును తనే వాదించుకుంది. తన తండ్రికి న్యాయం చేయమని సుప్రీంకోర్టు జడ్జీలను అర్థించింది. ఇలాంటివి అరుదైనవి. చాలా తక్కువ కేసుల్లో ఇలా జరుగుతుంది. ఇది వినడానికే వినూత్నంగా ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 14, 2023 / 05:11 PM IST
    Follow us on

    YS Sunitha : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చాలా రకాల విషయాలు బయటపడ్డాయి. ఇది రాజకీయ, కుట్ర కోణంలో మాత్రం జరిగింది కాదని.. ఆస్తి, ఇతరత్రా కారణాలు సైతం ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఎన్నికల ముందు వరకూ సైలెంట్ గా ఉన్న వివేకా కుమార్తె సునీత.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే బయటపడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డి శిబిరానికి వ్యతిరేకంగా పావులు కదిపారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జగన్ రాజకీయ ప్రత్యర్థుల సహకారంతో న్యాయ పోరాటానికి పూనుకున్నట్టు వార్తలు వచ్చాయి.

    స్వతహాగా వైఎస్ వివేకా కూతురు డాక్టర్. అయినా నిన్న తన కేసును తనే వాదించుకుంది. తన తండ్రికి న్యాయం చేయమని సుప్రీంకోర్టు జడ్జీలను అర్థించింది. ఇలాంటివి అరుదైనవి. చాలా తక్కువ కేసుల్లో ఇలా జరుగుతుంది. ఇది వినడానికే వినూత్నంగా ఉంది.

    తండ్రిని చంపిన వారికి చట్టబద్ధంగా శిక్ష పడాలని ఈమె పోరాడుతోంది. అయితే దీని కోసం ఆమె మొదట జగన్ ను కలిశారు. అక్కడ తేడా కొట్టడంతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    వివేకా హత్యకేసులో నిందితులకు శిక్షపడాలని సునీత గట్టిగానే పోరాడుతున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామమే. అయితే వివేకా 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. సునీత న్యాయ పోరాటం చేయడం ప్రారంభించింది మాత్రం వైసీపీ అధికారంలోకి సుమారు ఏడాదిన్నర తరువాత. వివేకా హత్యతో రాజకీయ లబ్ధి పొందింది జగన్. అంతులేని సానుభూతి పనిచేసింది. రాజకీయ ప్రత్యర్థులే మట్టుబెట్టారని చెప్పడంతో ప్రజలు కూడా అయ్యోపాపం అన్నారు. అటు కుటుంబమంతా ఏకతాటిపై ఉండడంతో ప్రజలు వారు చెప్పింది నమ్మారు. కానీ ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని.. అదే కుటుంబం వారు చెప్పడంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

    సుప్రీంకోర్ట్ లో తన కేసు తనే వాదించుకుని చరిత్ర సృష్టించిన డా. సునీత తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.