Homeఆంధ్రప్రదేశ్‌Dead body in MLC car: వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి డెడ్ బాడీ.. అర్థరాత్రి...

Dead body in MLC car: వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి డెడ్ బాడీ.. అర్థరాత్రి కలకలం.. అసలేం జరిగిందంటే?

Dead body in MLC car: ఏపీలోని కాకినాడ జిల్లాలో కలకలం చెలరేగింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం సంచలనమైంది. నిన్న అనంతబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అనుచరులు అంతా పార్టీ చేసుకున్నారని.. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని చెబుతున్నారు.

అయితే అతడి మృతదేహాన్ని ఎమ్మెల్సీ అనంతపబాబు నేరుగా సుబ్రహ్మణ్యం ఇంటికి తీసుకెళ్లగా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో డెడ్ బాడీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం మృతదేహం లభ్యం సంచలనమైంది.
నిన్న ఉదయమే కారులో డ్రైవర్ ను స్వయంగా ఎమ్మెల్సీ తీసుకెళ్లాడు. అర్ధరాత్రి యాక్సిడెంట్ అయిందని డ్రైవర్ తమ్ముడికి ఎమ్మెల్సీ ఉదయ్ బాబు సమాచారం ఇచ్చాడు.

తెల్లవారుజామున రెండు గంటలకు తన కారులోనే మృతదేహాన్ని డ్రైవర్ తల్లిదండ్రుల వద్దకు ఎమ్మెల్సీ తీసుకు వచ్చాడు. మృతదేహాన్ని కిందకు దించాలని తల్లిదండ్రులపై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పనిచేస్తున్న అపార్ట్మెంట్ ఎదుట ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.

ఐదేళ్లుగా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ వద్ద డ్రైవర్ గా సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నారు. నిన్న రాత్రి ఎమ్మెల్సీ అనుచరులు సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారని.. వాళ్లే తమ కొడుకును హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్సీ అనంతబాబు చెబుతుండగా.. ఎమ్మెల్సీనే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గురువారం అనంతబాబు పుట్టినరోజు కావడంతో అనుచరులంతా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో ఏదైనా గొడవ జరిగిందా? లేక మరేదైనా కారణముందా? అన్నది తెలియాల్సి ఉంది. పార్టీ జరుగుతుండగా టిఫిన్ కోసం సుబ్రహ్మణ్యం వెళ్లాడని.. అప్పుడు యాక్సిడెంట్ జరిగిందని ఎమ్మెల్సీ చెబుతున్నాడు. పార్టీలో భోజనం లేక టిఫిన్ కోసం బయటకు వెళ్లాడనడం అనుమానాలకు తావిస్తోంది. డ్రైవర్ ను స్వయంగా ఎమ్మెల్సీ వచ్చి తీసుకెళ్లి ఆ తర్వాత రోడ్డు ప్సరమాదంలో చనిపోయాడని చెప్పడం అనుమానాస్పదంగా మారింది.


Recommended Videos
పవన్ ను చూసి వణుకుతున్న జగన్ || Janasena Koulu Rythu Bharosa Yatra Grand Success || Pawan Kalyan
పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా లేదుగా | Pawan Kalyan Receives Grand Welcome | Janasena Nalgonda Tour
కాపులను రెచ్చగొట్టిన జగన్? | AP Rajya Sabha Seat for Telangana BC Leader R Krishnaiah | Ok Telugu
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version