https://oktelugu.com/

KCR- Damodara Rao: కేసీఆర్ కు ప్రేమా.. లేక భయమా? ఆయనకు పదవి ఎందుకిచ్చారు?

KCR- Damodara Rao: కరీంనగర్ జిల్లాకు పదవుల పంట పండుతోంది. జిల్లాకు చెందిన నేతలకు పలు మార్గాల్లో పదవులు దక్కుతున్నాయి. దీంతో నేతల్లో ఉత్సాహం పెరుగుతోంది. జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యంతో నేతల్లో ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకు కేసీఆర్ జిల్లాపై దృష్టి పెడుతున్నారు. ఇక్కడి వారికే పదవులు ఎందుకు ఇస్తున్నారు. వరుస పదవులతో నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మదిలో ఏముంది? భయమా? లేక ముందస్తు జాగ్రత్తనా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. హుజురాబాద్ ఉప […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 20, 2022 / 08:51 AM IST
    Follow us on

    KCR- Damodara Rao: కరీంనగర్ జిల్లాకు పదవుల పంట పండుతోంది. జిల్లాకు చెందిన నేతలకు పలు మార్గాల్లో పదవులు దక్కుతున్నాయి. దీంతో నేతల్లో ఉత్సాహం పెరుగుతోంది. జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యంతో నేతల్లో ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకు కేసీఆర్ జిల్లాపై దృష్టి పెడుతున్నారు. ఇక్కడి వారికే పదవులు ఎందుకు ఇస్తున్నారు. వరుస పదవులతో నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మదిలో ఏముంది? భయమా? లేక ముందస్తు జాగ్రత్తనా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

    KCR- Damodara Rao

    హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడి నేత వకళాభరణం కృష్ణమోహన్ రావుకు బీసీ కార్పొరేరషన్ చైర్మన్, పాడి కౌశిక్ రెడ్డి, ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవులు, బండ శ్రీనివాస్ కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. తాజాగా జిల్లాకు చెందిన దీనకొండ దామోదర్ రావుకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన కేసీఆర్ కరీంనగర్ జిల్లాపై ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది. నమస్తే తెలంగాణ ఎండీగా ఉన్న దామోదర్ రావుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పదవి ఇవ్వడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

    Also Read: BJP Parthasarathy: జగన్ రాజ్యసభ సీట్ల కేటాయింపు లొల్లి.. రగిలించిన బీజేపీ

    ఉద్యమ జిల్లాగా కరీంనగర్ పేరు పొందిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కలిసొచ్చిన ప్రాంతంగా ఆయన జిల్లాను ఎంచుకోవడం తెలిసిందే. పలుమార్లు ఇక్కడి నుంచే పోటీ చేసి తన సత్తా చాటింది ఇక్కడి నుంచే. అందుకే జిల్లాపై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకుంది కూడా ఇక్కడి నుంచే. దీంతో అల్లునూరులో ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

    పలుమార్లు జిల్లా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో ఎమ్మెస్సార్ విసిరిన సవాలుతో రాజీనామా చేసి బంపర్ మెజార్టీ సాధించి ఆయన నోరు మూయించిన కేసీఆర్ కు జిల్లా అంటే ప్రత్యేకమైన గురి ఉంటుందని అందరికి విధితమే. ఇందులో భాగంగానే జిల్లాకు పదవులు పంచుతున్నారనే వాదన కూడా వస్తోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాకు చెందిన వారే కావడంతో ఆయనను ఎదుర్కొనే క్రమంలో కూడా ఇలా వరాలు కురిపిస్తున్నారనే వాదన కూడా వస్తోంది.

    KCR

    కేసీఆర్ మొండితనం అందరికి తెలిసిందే. ఆయన ఎవరికి భయపడరనే విషయం కూడా పలుమార్లు రుజువు అయింది. మొత్తానికి జిల్లాకు చెందిన నేతలకు పదవులు దక్కడంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా మన వారికే పదవులు దక్కుతున్నందుకు నేతల్లో ఉత్సాహం వస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ముందుకు నడిచి విజయం సాధించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ విధంగా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

    Also Read:Pawan Kalyan Nalgonda Tour: జనసైనికుల కుటుంబాలకు నేనున్నానని.. పవన్ కళ్యాణ్ మానవత్వం
    Recommended Videos


    Tags