AP Muncipal Results 2021: అధికారంలో ఉంటే కొండ మీద కోతిని కూడా పట్టుకొని రావచ్చు. ప్రజలు కూడా అధికార పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఫిక్స్ అవుతారు. అందుకే శరామామూలుగానే ఆ పార్టీకి పట్టం కడుతారు. ఏ ఉప ఎన్నికలు స్థానిక ఎన్నికలు జరిగినా అధికార పార్టీలు గెలిచేది అందుకే.. ‘హుజూరాబాద్’లాంటి పంతాలు పట్టింపుల మధ్య సాగిన ఎన్నికలను మినహాయిస్తే దాదాపు అధికార పార్టీని గెలిపించేస్తారు. సార్వత్రిక ఎన్నికలకు వచ్చే సరికి ప్రజల మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. అప్పుడు ఎన్ని డబ్బులు పంచినా తాము గెలిపించాల్సిన పార్టీకే ఓటేస్తారు.. అది వేరే సంగతి..

తాజాగా ఏపీలో జరిగిన స్తానిక, మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీకి పట్టం కట్టారు. సహజంగానే జనాలు అభివృద్ధి కోణంలో ఆలోచించి జగన్ కే జైకొట్టారు. సంక్షేమ పథకాల ప్రభావమా? లేదా జగన్ మోహన్ రెడ్డి అందించగల పరిపాలన మీదనా? తద్వార భవిష్యత్ మీద ప్రజలకు ఆందోళన వల్లనే ఏమో కానీ అధికార పార్టీతో పెట్టుకోకూడదని జనాలు ఫ్యాన్ పార్టీకే గుద్దేశారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష టీడీపీకి గట్టి షాక్ తగిలాయి. గుడ్డిలో మెల్లగా జనసేనకు ఊరట లభించింది.
వైసీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ పట్టం కట్టడం విశేషం. అత్యధిక స్థానాలను వైసీపీకే కట్టబెట్టారు. కొన్ని వార్డులు మినహా అన్నింటిని కట్టబెట్టారు.
ఏపీలో మొత్తం 353 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో వైసీపీకి 261 స్థానాలు దక్కడం విశేషం. ఇక టీడీపీకి కేవలం 82 స్థానాలు మాత్రమే దక్కాయి. మూడో వంతు కంటే తక్కువ సీట్లు వచ్చాయి. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కు కేవలం 5 సీట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. స్వతంత్రులకు 5 సీట్లు రావడం విశేషం.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటిన జనసేన ఈ ఎన్నికల్లో మాత్రం తేలిపోయింది. జనసేనాని బలం మాత్రం సరిపోలేదు. ఇక వైసీపీని ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీకి గట్టి షాక్ తగులుతున్నాయి. బీజేపీకి గట్టి షాక్ యే తగిలింది. మరి ఈ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయ పరిణామాలను ఎలా మరుస్తాయన్నది వేచిచూడాలి.