Godfather: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. విడుదలకు సిద్దమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులకు సైన్ చేసి.. ఫుల్ బిజీగా మారారు చిరు. ఈ క్రమంలోనే మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్ సినిమా చేస్తున్నారు. మలయాళంలో హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు ఈ సినిమా రీమేక్. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరుకు తమ్ముడి పాత్రలో హీరో సత్యదేవ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ సినిమాలో సత్యదేవ్‌కు భార్యగా నయనతార నటిస్తుందని ఇటీవలే వార్తలు వినిపించాయి. అయితే, సత్యదేవ్ తన వయసుకు సరిపోడని.. అతడి ప్లేస్‌లో వేరొకరిని రీప్లేస్ చేయాలని నయన్ కోరినట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయంపై చిత్రయూనిట్ అందించిన సమాచారం ప్రకారం.. సత్యదేవ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాలో నుండి తీసేది లేదని.. వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. జనవరి నుంచి షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం.
ఈసినిమాతో పాటు మెహర్ రమేశ్‌తో భోళాశంకర్ సినిమా తీస్తున్నారు చిరు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓప్పుకున్నారు. ఇలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. ఆచార్య సినిమాలో రామ్‌చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డె నటిస్తోంది. ఇటీవలే విడుదలైన పాటలు మంచి టాక్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.