Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నిర్మించిన ‘యాదాద్రి’ ఆలయం అద్భుతమైన కట్టడం.. వెనుకటికి రాజులు కట్టిన కంటే కూడా గొప్పగా యాదాద్రిని కేసీఆర్ కటించాడు. అందుకు కేసీఆర్ ను అభినందించి తీరాల్సిందే. ఈ 2.50 లక్షల టన్నుల కృష్ణ శిలతో యాదాద్రిని నిర్మించడం విశేషం. వందలాది మంది శిల్పులు, వేల మంది కార్మికులు, ఇంజినీర్లు ఈ యాదాద్రిని కట్టారు. ఇందుకే కేసీఆర్ దీన్ని పూర్తి చేసినందుకు అభినందించాలి.

కేసీఆర్ ఒక దేవాలయానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు పెట్టడం సమంజసమేనా? అన్నది ఇక్కడ ప్రశ్నించుకోవాలి. గుజరాత్ లో సోమనాథ్ ఆలయాన్ని నిర్మిస్తే.. ప్రజలు విరాళాలు ఇచ్చి కట్టినా జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించడానికి అభ్యంతరం తెలిపారు. ఎందుకంటే అది ప్రజల సొమ్ముతో కట్టింది. ప్రభుత్వాలు కట్టలేదని విమర్శించారు.
Also Read: Sri Lanka Financial Crisis 2022: శ్రీలంకలో తీవ్ర సంక్షోభానికి కారణాలేంటి?
యాదాద్రి ఆలయం కంటే కూడా తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి. ధాన్యం కొనలేక రైతుల వద్ద ధాన్యంపేరుకుపోతున్నాయి.కానీ యాదాద్రి కోసం 1800 కోట్లు ఖర్చు చేయడం సాహసమేనని చెప్పాలి. రోడ్లు, పార్కులు, రైతుల కష్టాలు , తెలంగాణలోని ఇతర సమస్యలు తీర్చాల్సి ఉండేది.
నిజాంగా కేసీఆర్ యాదాద్రి కట్టాలనుకుంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి ప్రజలను విరాళాలు అడిగితే 1800 కోట్లు కంటే ఎక్కువే వసూలు అయ్యేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వ సొమ్ముతో యాదాద్రి కట్టడమే విమర్శలకు తావిస్తోంది. ఒక సెక్యూలర్ దేశంలో ఇలా ఒక ఆలయానికి ఇంత డబ్బు వెచ్చించడం న్యాయమా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.
Also Read: Indigo Airlines: బ్యాగ్ పోగొట్టారనే కక్షతో ఏకంగా ఇండిగో వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ప్రయాణికుడు?