Severe Suns: తెలంగాణలో ఎండలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గడచిన రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం తెలిసిందే. దీంతో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఎండ ప్రతాపం చూపిస్తూనే ఉంది. దీంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు తీసుకోరాదు. మసాలాలు ఎక్కువగా వాడరాదు. బయటకు వెళ్లాల్సి వస్తే క్యాప్ వాడాల్సిందే. అధికారులు సూచించే సూచనలు పాటిస్తే జాగ్రత్తగా ఉండొచ్చు. లేదంటే వడదెబ్బకు గురైతే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది.
Also Read: Varun Tej Ghani Trailer Talk: ట్రైలర్ టాక్ : బాక్సింగ్ డ్రామాలో ‘వరుణ్ తేజ్’ ఎమోషనల్ డ్రామా
ఎండ తీవ్రత వచ్చే నెలలో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 44-46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎండ ముప్పును తట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అందుకు ఎండలో తిరగకుండా చూసుకోవాలి. వడదెబ్బ సోకితే పాటించాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. నలుపు రంగు దుస్తులు కాకుండా తెల్ల దుస్తులు వాడాలని చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగుతూ ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. దీంతో ఎండ బారి నుంచి రక్షించుకోవాలని అంటున్నారు. అధికారులు కూడా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: Telangana Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ సుముఖమేనా?