https://oktelugu.com/

యాపిల్ ఫోన్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన మహిళ.. పార్సిల్ చూసి షాక్..?

ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరో వస్తువు డెలివరీ కావడం గురించి చాలా సందర్భాల్లో విన్నాం. తాజాగా ఒక మహిళ యాపిల్ ఫోన్ ను ఆర్డర్ చేయగా యాపిల్ జ్యూస్ డెలివరీ అయింది. చైనా దేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈకామర్స్ సంస్థల్లో ఆర్డర్ చేస్తే ఇలాంటి పొరపాట్లు జరగడం కామన్ అయినప్పటికీ సదరు మహిళ యాపిల్ వెబ్ సైట్ లో ఫోన్ ఆర్డర్ చేసినా ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 3, 2021 1:24 pm
    Follow us on

    Women Orders iPhone 12

    ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరో వస్తువు డెలివరీ కావడం గురించి చాలా సందర్భాల్లో విన్నాం. తాజాగా ఒక మహిళ యాపిల్ ఫోన్ ను ఆర్డర్ చేయగా యాపిల్ జ్యూస్ డెలివరీ అయింది. చైనా దేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈకామర్స్ సంస్థల్లో ఆర్డర్ చేస్తే ఇలాంటి పొరపాట్లు జరగడం కామన్ అయినప్పటికీ సదరు మహిళ యాపిల్ వెబ్ సైట్ లో ఫోన్ ఆర్డర్ చేసినా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

    Also Read: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే..?

    పూర్తి వివరాల్లోకి వెళితే చైనా దేశంలో నివశించే లియా కొన్ని రోజుల క్రితం యాపిల్ వెబ్ సైట్ లో ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్‌ ను ఆర్డర్ చేసి ఆ ఫోన్ డెలివరీ కోసం ఆసక్తిగా ఎదురు చూసింది. ఫోన్ డెలివరీ అయిన తరువాత మహిళ ప్యాకేజీని విప్పి చూసి అవాక్కైంది. ప్యాకేజీలో యాపిల్ జ్యూస్ కనిపించడంతో ఏం చేయాలో ఆ మహిళకు అర్థం కాలేదు. ఫోన్ కు బదులుగా జ్యూస్ రావడంతో అవాక్కైన మహిళ వెంటనే ఫోన్ కు బదులుగా జ్యూస్ వచ్చిందని యాపిల్ సంస్థకు ఫిర్యాదు చేసింది.

    Also Read: ఆన్ లైన్ లో డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. ఉన్న ఆప్షన్లివే..?

    మహిళ తన ఫిర్యాదులో డెలివరీ బాయ్ పార్సిల్ ను అపార్టుమెంట్ లోని లాకర్ లో వదిలి వెళ్లాడని.. తన చేతికి నేరుగా పార్సిల్ అందలేదని పేర్కొంది. యాపిల్ సంస్థ కేసు నమోదు చేసుకుని ఈ ఘటన గురించి దర్యాప్తు చేస్తోంది. కొరియర్ సంస్థ నిర్లక్ష్యం వల్లే పార్సిల్ కరెక్ట్ గా డెలివరీ కాలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో పొరపాటు ఎక్కడ జరిగిందో తెలిసే అవకాశం ఉంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కొరియర్ సంస్థను తప్పుబడుతుంటే మరిల్ కొందరు యాపిల్ సంస్థ డెలివరీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఎవరో చేసిన తప్పు వల్ల కంపెనీలకు చెడ్డపేరు వస్తోంది.