కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం కిషోర్ సైంటిఫిక్ ఇన్సెంటివ్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా సైన్స్ సంబంధిత విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. సైన్స్ రంగంలో చదివే ప్రతి విద్యార్థికి ఈ స్కీమ్ ద్వారా 5వేల రూపాయల నుంచి 7 వేల రూపాయల వరకు స్టైఫండ్ అందనుంది.
Also Read: విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. ఫ్రీగా టాబ్లెట్స్, టెక్ట్స్ బుక్స్..?
ఇంటర్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న సైన్స్ విద్యార్థులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీమ్ ద్వారా డిగ్రీ చదివిన విద్యార్థులకు ఫెలోషిప్ లు అందనున్నాయి. సైన్స్, టెక్నాలజీతో పాటు మెడికల్ రంగాల్లో పని చేసేవాళ్లకు సైతం కిషోర్ సైంటిఫిక్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. బీటెక్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు..?
గడిచిన 20 సంవత్సరాలుగా ఈ స్కీమ్ అమలవుతోంది. రెండు వేర్వేరు ఫెలోషిప్ లు ఈ స్కీమ్ ద్వారా అందుతుండగా ఒక స్కీమ్ ద్వారా 5 వేల రూపాయలు, మరో స్కీమ్ ద్వారా 7 వేల రూపాయలు ఫెలోషిప్ పొందే ఛాన్స్ ఉంది. దేశంలోని సైన్స్ రంగానికి చెందిన విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలు జరుగుతోంది. ఉన్నతస్థాయి ప్రవేశ పరీక్షను నిర్వహించి పరీక్షలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
తొలిదశలో ఆన్ లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించగా రెండో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్ లో 75 శాతం మార్కులు సాధించడంతో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండియర్ విద్యార్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉంటే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.