ఏలూరు వింత వ్యాధి తరహాలో.. ములుగులో అంతుచిక్కని వ్యాధి..!

2020 సంవత్సరం అంతా కరోనాతో గడిచిపోతుంది. ఇక 2021కి ముందే మరో కొత్త వైరస్ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బ్రిటన్.. దక్షిణాఫ్రికా దేశాల్లో విజృంభిస్తుండగా అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. కరోనా వైరస్ ఎంట్రీ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేశాయి. అదే సమయంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించాయి. మాస్కులు ధరించడం.. భౌతికదూరం పాటించడం.. చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి చేస్తూ […]

Written By: Neelambaram, Updated On : December 27, 2020 9:17 pm
Follow us on

2020 సంవత్సరం అంతా కరోనాతో గడిచిపోతుంది. ఇక 2021కి ముందే మరో కొత్త వైరస్ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బ్రిటన్.. దక్షిణాఫ్రికా దేశాల్లో విజృంభిస్తుండగా అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి.

కరోనా వైరస్ ఎంట్రీ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేశాయి. అదే సమయంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించాయి.

మాస్కులు ధరించడం.. భౌతికదూరం పాటించడం.. చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి చేస్తూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటున్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధులు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో వింతవ్యాధి వెలుగుచూసింది. పెద్దసంఖ్యలో జిల్లావాసులు వ్యాధిబారిన పడటం ఆందోళనకు గురిచేసింది. దీంతో ప్రభుత్వం రంగంలోకిదిగి బాధితులకు వైద్యం అందించిన సంగతి తెల్సిందే.

ఏలూరు ఘటన మరువముందే తెలంగాణలోని ములుగు జిల్లాలోనూ వింతవ్యాధి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ములుగు జిల్లాలోని ముప్పనపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ గ్రామంలో రెండు వారాల వ్యవధిలో ఆరుగురు మృతి చెందారు. రెండ్రోరోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో వైద్యాధికారులు గ్రామంలో శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

గ్రామస్థులంతా జ్వరం.. కడుపు ఉబ్బరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే రెండు వారాల వ్యవధిలోనే ఆరుగురు మృతిచెందాడంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు.