NTR Koratala Siva Movie: ఎన్టీఆర్ సినిమాకి భారీ బడ్జెట్.. ఎన్ని వందల కోట్లు అంటే..?

NTR Koratala Siva Movie: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి ఎన్టీఆర్, తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమాను కూడా వదులుకున్నాడు. కొరటాల చెప్పిన కథ, ఎన్టీఆర్ కి అంత గొప్పగా నచ్చింది. అయితే, కొరటాల కూడా ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. మరీ పాన్ ఇండియా సినిమా అంటే బడ్జెట్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా. కాగా తాజాగా ఈ సినిమా బడ్జెట్ పై […]

Written By: Shiva, Updated On : April 7, 2022 12:21 pm
Follow us on

NTR Koratala Siva Movie: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి ఎన్టీఆర్, తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమాను కూడా వదులుకున్నాడు. కొరటాల చెప్పిన కథ, ఎన్టీఆర్ కి అంత గొప్పగా నచ్చింది. అయితే, కొరటాల కూడా ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. మరీ పాన్ ఇండియా సినిమా అంటే బడ్జెట్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా.

NTR Koratala Siva Movie

కాగా తాజాగా ఈ సినిమా బడ్జెట్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు.

అందుకోసం.. హాలీవుడ్ యాక్షన్ టెక్నీషియన్స్ ను పెట్టుకుంటున్నాడు. మరి చూడాలి.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. ఇక కొరటాల ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ ఓ సోషల్ మెసేజ్ పాయింట్ ను చెప్పబోతున్నాడు. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో పాత్ర ఉందట. అయితే, ఆ పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోని తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.

Also Read: స్టార్ హీరోయిన్ గా వెలుగొంది.. క‌నుమ‌రుగైపోయిన భామ‌లు వీరే..

ఎందుకంటే ఎన్టీఆర్ కి సినిమాలో అది బాబాయ్ పాత్ర అట. వెరీ ఎమోషనల్ గా ఉండే ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అయితే బాగుంటుందని కొరటాల అభిప్రాయం. కానీ.. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తాడా ? ఒకవేళ అంగీకరిస్తే.. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో వెరీ క్రేజీ సినిమా అవుతుంది.

కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సమ్మర్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. అన్నట్టు ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేసారు. పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఓ పెద్ద సెట్ వేశారు. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్ లోనే ఉంటుందట.

Also Read: ఆర్ఆర్ఆర్’ కొత్త పార్టీ.. ఎన్టీఆర్ పై త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్ !

Tags