Congress: కాంగ్రెస్ అధిష్టానం మోములో ఒకవైపు మోదం రెండోవైపు ఖేదం

ఇంత చిన్న వయసులో సీఎం కావాలని లక్ష్యాన్ని నిర్ధేశించి సాధించుకోవడాన్ని రేవంత్ ను అభినందించాల్సిందే.. రేవంత్ రెడ్డిని చూసైనా సరే రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సిందే కదా.. రేవంత్ వయసు అంత ఉన్న రాహుల్ గాంధీ నేర్చుకొని ప్రధాని కావాల్సింది.

Written By: NARESH, Updated On : December 7, 2023 5:18 pm

రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 54 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కావటం నిజంగా గొప్ప విశేషం. రేవంత్ రెడ్డిలోని పట్టుదలకు మెచ్చుకోవాల్సిందే. ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం పీఠాన్ని ఇంత తక్కువ వయసులో అధిరోహించడం అంటే మాటలు కాదు.

ఇంత చిన్న వయసులో సీఎం కావాలని లక్ష్యాన్ని నిర్ధేశించి సాధించుకోవడాన్ని రేవంత్ ను అభినందించాల్సిందే.. రేవంత్ రెడ్డిని చూసైనా సరే రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సిందే కదా.. రేవంత్ వయసు అంత ఉన్న రాహుల్ గాంధీ నేర్చుకొని ప్రధాని కావాల్సింది.

రేవంత్ రెడ్డికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. నెట్ వర్క్ లేదు. అయినా సీఎం అయ్యాడు. రాహుల్ వెనుక పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కావాల్సిన ధన, అంగ, అర్థ బలాలున్నాయి. కానీ రాహుల్ గాంధీలోని అపరిపక్వత అనేదే పెద్ద మైనస్. ప్రణబ్ ముఖర్జీ బయోగ్రఫీలో కూడా రాహుల్ గాంధీలోని అపరిపక్వతను ప్రస్తావించాడు.

కాంగ్రెస్ అధిష్టానం మోములో ఒకవైపు మోదం.. రెండోవైపు ఖేదం పై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.