Homeఆంధ్రప్రదేశ్‌KCR News Paper : పెద్దపెద్ద పత్రికలు మూసుకుంటున్నాయి.. ఇక కేసీఆర్ కొత్త పత్రిక మనుగడ...

KCR News Paper : పెద్దపెద్ద పత్రికలు మూసుకుంటున్నాయి.. ఇక కేసీఆర్ కొత్త పత్రిక మనుగడ ఎంతకాలం?

KCR News Paper : పాత్రికేయం పాత్రికేయం లాగా లేదు.. ఇవేమీ పాలగుమ్మి సాయినాధ్ రోజులు కావు.. సూటిగా చెప్పాలంటే వేమూరి రాధాకృష్ణ రోజులు. అంటే నచ్చని వాడిని కొట్టడం. నచ్చిన వాడికి జేజేలు పలకడం.. ఇలాంటి స్థితిలో ఈ పేపర్ అయినా, ఏ ఛానల్ అయినా ఏర్పాటు చేస్తే ఓట్లు లభిస్తాయా? ఇవి ప్రచురించే వార్తలు, ప్రసారం చేసే కథనాలు చూసి జనం పోలో మంటూ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓట్లు వేస్తారా? అధికారం కట్టబెడతారా? ప్రొఫెషనల్ గా నడిపిస్తూనే, అంతర్గతంగా ఒక రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూస్తే కొంతలో కొంత లాభం ఉంటుందేమో.. దక్షిణాదిన ఓ మురసోలి, ఈనాడు, మలయాళ మనోరమ, మాతృభూమి, విజయవాణి, ఆంధ్రజ్యోతి, సాక్షి పొలిటికల్ లైన్ లో పనిచేశాయి.. పనిచేస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు వీటిని కూడా దేఖే పరిస్థితులు లేవు.. పైగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాఠకులు బేరీజు వేసుకుంటున్నారు. అందుకే కదా పేపర్ల సర్కులేషన్ తగ్గేది.. త్వరలో ప్రింట్ మీడియా మూతపడుతుంది అనేది. ఇలాంటి స్థితిలో ఒక పత్రికను తీసుకురావడం అనేది నిజంగా సాహసమే. ఇప్పుడు ఇదే పని కెసిఆర్ చేయబోతున్నారు.

అవసరం కనుక

భారత రాష్ట్ర సమితి ఇప్పుడు జాతీయ పార్టీ కనుక.. అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలు ఏర్పాటు చేసేందుకు సన్నా హాలు జరుగుతున్నాయని ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. మొన్న మహారాష్ట్రలో నిర్వహించినట్టు ఇతర రాష్ట్రాల్లోనూ సభలు జరపాలని అనుకుంటున్నారు.. ఏకంగా ప్రధాని కుర్చీపైనే కెసిఆర్ కన్ను వేసిన నేపథ్యంలో… నమస్తే తెలంగాణ తరహా లోనే సొంత మీడియా హౌస్ లో ఉండాలని కెసిఆర్ ప్లాన్ గా ఉందని భారత రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి. అయితే ఇందులో న్యూస్ చానల్స్ జోలికి పోకుండా ప్రింట్ మీడియా హౌసులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది..

రీచ్ ఎంత?

ఇప్పుడు ఉన్న సాధన సంపత్తితో కేసీఆర్ ఎన్ని పత్రికలైనా పెట్టగలడు. ఏదైనా చేయగలడు. కానీ వాటి ద్వారా జనాల్లోకి వెళ్లే రీచ్ ఎంత? ఉద్యమ సమయంలో నమస్తే తెలంగాణ పత్రిక ప్రభ వెలిగిపోయింది. ఎప్పుడైతే అది గులాబీ రంగు పూసుకుందో అప్పుడే తన క్రెడిబిలిటీ కోల్పోయింది. ఉద్యమ పత్రిక కాస్త భజన పత్రిక అయింది. పైగా ఆ భారత రాష్ట్ర సమితి నాయకులకు టార్గెట్లు పెట్టినప్పటికీ అంతగా రీచ్ కావడం లేదు. అసలు ఆ నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తల్ని ఆ భారత రాష్ట్ర సమితి నాయకులే చదవరు.. ఇక ప్రజలకు ఏం ఇంట్రస్ట్ ఉంటుంది? ఇక నామమాత్రంగా సక్సెస్ ఉనికి ఉండే ఇతర రాష్ట్రాల్లో నమస్తే, గిమస్తే అని పెడితే ఎవడు చదువుతాడు.

సరే ఇవన్నీ పక్కన పెడితే త్వరలో కేసీఆర్ ప్రారంభించబోయే నమస్తే ఆంధ్రప్రదేశ్లో పోలవరం గురించి ఏం రాస్తారు? పోతిరెడ్డిపాడు గురించి ఏం రాస్తారు? రాయలసీమ లిఫ్ట్ పై ఏం రాస్తారు? శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ మహారాష్ట్రకు ఇవ్వాలి. పోలవరం ఎత్తు పెంచుకోవాలి. బాబ్లీ మంచి ప్రాజెక్టు, తెలంగాణకు చుక్కనీరు రాకపోయినా పర్వాలేదు అని రాస్తారా? దీన్ని ఆ పత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి సమర్థిస్తారా? ఈ జాతీయ రాజకీయాల వల్ల ఉద్యమ నేత కేసీఆర్ ఎలా ఉండే వాడు… ఎలా అయిపోయాడు?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular