https://oktelugu.com/

CM Jagan: క్యాబినెట్ ప్రక్షాళనతో జగన్.. ఆ ముఖ్యమంత్రుల సరసన చేరనున్నారా?

CM Jagan: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి తన క్యాబినేట్ ను విస్తరించనునున్నారు. ఏప్రిల్ 11 తేదిన ఏపీలో కొత్త క్యాబినేట్ కొలువు దీరనుంది. ఈ నేపథ్యంలో గతంలో ఏయే ముఖ్యమంత్రులు తమ క్యాబినేట్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి విజయం సాధించారు? ఎవరు తమ ముఖ్యమంత్రి పదవీని సైతం కోల్పోవాల్సి వచ్చిందనే చర్చ తెరపైకి వస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా నాటి ముఖ్యమంత్రులు అంజయ్య, ఎన్టీ రామారావు, జయలలిత, మాయవతిలు తమ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 10, 2022 / 10:19 AM IST
    Follow us on

    CM Jagan: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి తన క్యాబినేట్ ను విస్తరించనునున్నారు. ఏప్రిల్ 11 తేదిన ఏపీలో కొత్త క్యాబినేట్ కొలువు దీరనుంది. ఈ నేపథ్యంలో గతంలో ఏయే ముఖ్యమంత్రులు తమ క్యాబినేట్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి విజయం సాధించారు? ఎవరు తమ ముఖ్యమంత్రి పదవీని సైతం కోల్పోవాల్సి వచ్చిందనే చర్చ తెరపైకి వస్తోంది.

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా నాటి ముఖ్యమంత్రులు అంజయ్య, ఎన్టీ రామారావు, జయలలిత, మాయవతిలు తమ క్యాబినేట్ ను పూర్తిగా ప్రక్షాళన చేశారు. అయితే వీరి వ్యూహాలు బెడిసి కొట్టడంతో చివరి తమ సీఎం సీటుకే ఎసరు వచ్చింది. దీంతో వీరందరికీ కలిసి రాని సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డికి ఏమేరకు కలిసి వస్తుందనేది ఆసక్తిని రేపుతోంది.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 11, 1980లో టంగుటూరి అంజయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టారు. నాడు క్యాబినెట్లోకి 58మందిని తీసుకొని ఆయన జంబో క్యాబినేట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్ లోని 15మందిని తీసుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం జంబో క్యాబినేట్ వద్దని సూచించడంతో అనివార్యంగా మంత్రుల సంఖ్యను తగ్గించారు.

    కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేసిన రెండ్రోజుల్లోనే అసమ్మతి మొదలైంది. నేతలంతా తిరుగుబాటు చేయడంతో కేవలం 16నెలల్లో అంజయ్య తన సీఎం పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. తన క్యాబినెట్లోని 31మంది మంత్రులతో ఎన్టీఆర్ రాజీనామా చేయించి గవర్నర్ కు పంపించడం అప్పట్లో సంచలనంగా మారింది.

    వారంరోజులు క్యాబినేట్ లేకుండానే ఆయన సీఎంగా పనులు చక్కబెట్టారు. ఆ తర్వాత 23మందితో కొత్త క్యాబినేట్ ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. మంత్రి వర్గంలో చోటు కోల్పోయిన వారికి కీలకమైన పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ దారుణంగా ఓటమిపాలై సీఎం పదవీని కొల్పోవాల్సి వచ్చింది.

    ఉత్తర ప్రదేశ్ మాయవతి 2007లో అధికారంలోకి వచ్చారు. తన క్యాబినెట్లోకి 54మందిలో సగానికి పైగా మంత్రులపై అవినీతి ఆరోపణలు రావడంతో వారందరికీ ఆమె ఉద్వాసన పలికారు. కొత్తగా 25మందికి ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా 10మందిపై మళ్లీ వేటు వేశారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాయవతి ఓటమి పాలైయ్యారు.

    తమిళనాడు సీఎం జయలలిత కూడా మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని తొలగించారు. ఆమె కూడా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి 24మంది మంత్రులతో రాజీనామా చేయించారు. జగన్మోహన్ రెడ్డి ముందుగానే రెండున్నేరేళ్ల తర్వాత క్యాబినేట్ ప్రక్షాళన ఉంటుందని చెప్పారు. అదే ఇప్పుడు చేస్తున్నారు. దీంతో అంజయ్య, ఎన్టీఆర్ లకు కలిసిరాని మంత్రివర్గ ప్రక్షాళన జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అవుతుందా? లేదా అన్నది మాత్రం తేలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు.