Homeప్రత్యేకంCM Jagan: క్యాబినెట్ ప్రక్షాళనతో జగన్.. ఆ ముఖ్యమంత్రుల సరసన చేరనున్నారా?

CM Jagan: క్యాబినెట్ ప్రక్షాళనతో జగన్.. ఆ ముఖ్యమంత్రుల సరసన చేరనున్నారా?

CM Jagan: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి తన క్యాబినేట్ ను విస్తరించనునున్నారు. ఏప్రిల్ 11 తేదిన ఏపీలో కొత్త క్యాబినేట్ కొలువు దీరనుంది. ఈ నేపథ్యంలో గతంలో ఏయే ముఖ్యమంత్రులు తమ క్యాబినేట్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి విజయం సాధించారు? ఎవరు తమ ముఖ్యమంత్రి పదవీని సైతం కోల్పోవాల్సి వచ్చిందనే చర్చ తెరపైకి వస్తోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా నాటి ముఖ్యమంత్రులు అంజయ్య, ఎన్టీ రామారావు, జయలలిత, మాయవతిలు తమ క్యాబినేట్ ను పూర్తిగా ప్రక్షాళన చేశారు. అయితే వీరి వ్యూహాలు బెడిసి కొట్టడంతో చివరి తమ సీఎం సీటుకే ఎసరు వచ్చింది. దీంతో వీరందరికీ కలిసి రాని సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డికి ఏమేరకు కలిసి వస్తుందనేది ఆసక్తిని రేపుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 11, 1980లో టంగుటూరి అంజయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టారు. నాడు క్యాబినెట్లోకి 58మందిని తీసుకొని ఆయన జంబో క్యాబినేట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్ లోని 15మందిని తీసుకున్నారు. అయితే అధిష్టానం మాత్రం జంబో క్యాబినేట్ వద్దని సూచించడంతో అనివార్యంగా మంత్రుల సంఖ్యను తగ్గించారు.

కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేసిన రెండ్రోజుల్లోనే అసమ్మతి మొదలైంది. నేతలంతా తిరుగుబాటు చేయడంతో కేవలం 16నెలల్లో అంజయ్య తన సీఎం పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. తన క్యాబినెట్లోని 31మంది మంత్రులతో ఎన్టీఆర్ రాజీనామా చేయించి గవర్నర్ కు పంపించడం అప్పట్లో సంచలనంగా మారింది.

వారంరోజులు క్యాబినేట్ లేకుండానే ఆయన సీఎంగా పనులు చక్కబెట్టారు. ఆ తర్వాత 23మందితో కొత్త క్యాబినేట్ ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. మంత్రి వర్గంలో చోటు కోల్పోయిన వారికి కీలకమైన పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ దారుణంగా ఓటమిపాలై సీఎం పదవీని కొల్పోవాల్సి వచ్చింది.

ఉత్తర ప్రదేశ్ మాయవతి 2007లో అధికారంలోకి వచ్చారు. తన క్యాబినెట్లోకి 54మందిలో సగానికి పైగా మంత్రులపై అవినీతి ఆరోపణలు రావడంతో వారందరికీ ఆమె ఉద్వాసన పలికారు. కొత్తగా 25మందికి ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా 10మందిపై మళ్లీ వేటు వేశారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాయవతి ఓటమి పాలైయ్యారు.

తమిళనాడు సీఎం జయలలిత కూడా మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని తొలగించారు. ఆమె కూడా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి 24మంది మంత్రులతో రాజీనామా చేయించారు. జగన్మోహన్ రెడ్డి ముందుగానే రెండున్నేరేళ్ల తర్వాత క్యాబినేట్ ప్రక్షాళన ఉంటుందని చెప్పారు. అదే ఇప్పుడు చేస్తున్నారు. దీంతో అంజయ్య, ఎన్టీఆర్ లకు కలిసిరాని మంత్రివర్గ ప్రక్షాళన జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అవుతుందా? లేదా అన్నది మాత్రం తేలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

  1. […] Women’s Empowerment: ఆడవాళ్లంటే అబలలు కాదు సబలలు అని నిరూపిస్తున్నారు. ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ వారి డిమాండ్ ఉన్నా ఆడవారికి అన్నింటా అన్యాయమే జరుగుతోందని వాదన ఉన్నా వారు కూడా అన్నింట్లో రాణిస్తున్నారు. ఏ రంగం చూసినా ఎంతటి తెగువనైనా చూపించి త్యాగాలు చేస్తూ జీవనరంగంలో దూసుకెళ్తున్నారు. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడాలున్నాయి. మహిళలు అన్నింట్లో తమదైన శైలిలో తమ సత్తా చాటుతున్నారు. డ్రైవర్ దగ్గర నుంచి పైలట్ వరకు అన్ని వృత్తులు చేస్తూ మగవారికి సమానంగా సవాలు విసురుతున్నారు. […]

  2. […] AP New Cabinet: ఏపీ మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ముంచుకొస్తోంది. మరో 24 గంటల వ్యవధే ఉంది. దీంతో అంతటా టెన్షన్ టెన్షన్ నెలకొంది. కొత్త మంత్రులు ఎవరు అన్న చర్చ లోతుగా సాగుతోంది. మరోవైపు నూతన మంత్రివర్గం దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా కొత్త మంత్రి వర్గం కసరత్తు ఎన్నడూ లేనివిధంగా సీఎం జగన్ మెడకు చుట్టుకుంది. కొత్త కేబినెట్ కూర్పునకు సుదీర్ఘ సమయం వెచ్చించారు. గవర్నర్ ఆమోదానికి ఇప్పటికే రాజీనామా లేఖలు పంపించారు. సీనియర్‌ల ఒత్తిడికి దిగివచ్చిన ముఖ్యమంత్రి 8 నుంచి 10 మంది పాత వారికి కాబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు సమాచారం. […]

  3. […] Funny Wedding Gift: Funny Wedding Gift: వివాహాల్లో నవ్వుల పువ్వులు పూయించడం పరిపాటే. అయితే కొందరు కొన్ని విచిత్రమైన పద్ధతుల్లో వియ్యాల వారిని ఆటపట్టిస్తుంటారు. ఇంకొందరు వధూవరులను కూడా తమదైన శైలిలో ఆడుకుంటారు. వారితో ఏవో పనులు చేయిస్తూ అందరు పగలబడి నవ్వుకునేలా చేస్తుంటారు. వివాహమంటేనే సందడి. చాలా మంది సరదాలు చేస్తుంటారు. స్నేహితులు, బంధువులు అందరు వధూవరులను ఆటపట్టస్తుంటారు. ఏవో ప్యాకెట్లు తీసుకొచ్చి విప్పిస్తుంటారు. చివరకు అందులో ఏదో ఒక వింత వస్తువు పెట్టి సరదాగా హాస్యం పండిస్తుంటారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular