
పంజాబ్-హర్యానా హైకోర్టు భార్యను చంపిన భర్త కేసులో పెన్షన్ విషయంలో సంచలన తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్తను చంపిన కేసులో భార్యకు పెన్షన్ తీసుకునే హక్కు ఉందని తేల్చి చెప్పింది. హర్యానా సర్కార్ భర్తను చంపిన భార్య కేసులో పెన్షన్ ఇచ్చేది లేదని పేర్కొనగా ప్రభుత్వ ఆదేశాలను కోర్టు తప్పుబట్టింది. భార్యకు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాల్సిందేనని.. భర్త చనిపోయి ఎటువంటి ఆధారం లేకపోతే పెన్షన్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది.
బల్జీత్ కౌర్ అనే మహిళ పిటిషన్ ను దాఖలు చేయగా కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. భర్తను భార్యే చంపిందని తేలినా భార్యకు పెన్షన్ ఇవ్వడంలో తప్పేంటని తెలిపింది. 2008 సంవత్సరంలో బల్జీత్ కౌర్ భర్త మరణించగా 2009 సంవత్సరంలో పోలీసులు ఆమెనే భర్తను చంపిందని కేసు నమోదు చేశారు. కేసు నమోదు తరువాత మహిళనే హత్య చేసినట్లు ప్రూవ్ అయింది. మహిళ దోషిగా తేలడంతో ప్రభుత్వం మహిళకు పెన్షన్ ను నిలిపివేసింది.
అయితే కుటుంబానికి మహిళే ఆధారం కావడం ఆమె పెన్షన్ నిలిపివేయడంతో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. మహిళ పెన్షన్ కోసం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సంబంధిత శాఖకు బల్జీత్ కౌర్‌కు పూర్తి బకాయిలతో సహా పెన్షన్ ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. సీసీఎస్ రూల్స్, 1972 ప్రకారం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి భర్త చనిపోతే భార్య పెన్షన్ కు అర్హురాలు అవుతుంది.
భర్త చనిపోయిన తరువాత రెండో వివాహం చేసుకున్నా కూడా భార్యకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే బల్జీత్ కౌర్ కేసులో భార్యే భర్తను చంపివేయడంతో ప్రభుత్వం పెన్షన్ ను నిలిపివేయగా కోర్టు మాత్రం భార్య భర్తను చంపేసినా ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం గమనార్హం.