Virat Kohli: ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ నుంచి కోహ్లీ ఎందుకు వైదొలిగాడు…అసలు కారణం ఏంటి..?

ఇండియన్ టీమ్ ఫ్యాన్స్ గాని అందరూ కూడా కోహ్లీ ఎందుకు మొదటి రెండు మ్యాచులు ఆడటం లేదు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : January 23, 2024 10:49 am

Virat Kohli

Follow us on

Virat Kohli: ఈనెల 25వ తేదీ నుంచి ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక అందులో భాగంగానే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు ఇండియన్ టీమ్ లో టాప్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ దూరం కానున్న విషయాన్ని ఇప్పటికే బిసిసిఐ ప్రకటించింది.ఇక ఈ విషయం తెలుసుకున్న కోహ్లీ అభిమానులు గాని, ఇండియన్ టీమ్ ఫ్యాన్స్ గాని అందరూ కూడా కోహ్లీ ఎందుకు మొదటి రెండు మ్యాచులు ఆడటం లేదు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు.

ఇక ఆ రెండు మ్యాచ్ లు ఆడక పోవడానికి గల కారణం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో కోహ్లీ రెండు మ్యాచ్ ల నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఆయన పర్సనల్ ప్రాబ్లం వల్ల తను తప్పుకుంటున్నట్టుగా చెప్పాడు. అయినప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మాత్రం ఆయన ఎక్కడ రివిల్ చేయలేదు. ఆయన పర్సనల్ అన్నప్పుడు వాటిని ఏంటి అని అడిగే హక్కు కూడా ఎవరికి లేదు కాబట్టి తనంతట తాను రెండు మ్యాచ్ లకు దూరంగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తో మూడు టి20 మ్యాచ్ లను ఆడిన సందర్భంలో కూడా మొదటి మ్యాచ్ కి కోహ్లీ దూరమయ్యాడు.

ఇలా కోహ్లీ ఎందుకు వరుసగా మ్యాచ్ ల నుంచి దూరమవుతున్నాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఎంతమంది ప్లేయర్లు గాయం కారణంగా టీమ్ కి దూరమై రెస్ట్ తీసుకున్నప్పటికీ కోహ్లీ మాత్రం ఎప్పుడు ఫిట్ గా ఉంటూ ప్రతి మ్యాచ్ ని ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ తనే దగ్గరుండి మరి మ్యాచ్ ని గెలిపిస్తూ వచ్చారు. ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు వరుసగా తను ఎందుకు మ్యాచ్ లను ఆడకుండా ఎగ్గొడుతున్నాడు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇది ఇక ఉంటే ఈ ఐదు మ్యాచ్ ల్లో ఇండియన్ టీం మూడు మ్యాచ్ ల్లో గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలి. లేకపోతే ఈ సిరీస్ ఇండియాలోనే ఆడుతున్నారు కాబట్టి మన దేశానికి వచ్చి ఇంగ్లాండ్ కప్పు తీసుకెళ్తే మన టీమ్ కి సిగ్గు చేటు. ఇక రెండోది డబ్ల్యూటీసి ఫైనల్ కోసం మనవాళ్లు ఈ సిరీస్ ని తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదిలా ఉంటే కోహ్లీ ప్లేస్ లో నెంబర్ ఫోర్ లో బ్యాటింగ్ చేయడానికి శ్రేయాస్ అయ్యర్ గానీ, కే ఎల్ రాహుల్ గానీ ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక కీపర్స్ గా కే ఎస్ భరత్ గాని, ధృవ్ జురేల్ గాని ఎవరో ఒకరు ఆడే అవకాశాలు ఉన్నాయి…