ఆ ఇంట్లో దెయ్యం.. కాలనీ ఖాళీ చేసిన 40 కుటుంబాలు..?

మనలో చాలామంది దెయ్యాలు ఉన్నాయంటే అస్సలు నమ్మరు. అయితే జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో నివశించే ప్రజలు మాత్రం దెయ్యం పేరు వింటే గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. బేడ, బుడగజంగాల ప్రజలు దెయ్యం పేరు వింటే భయపడుతున్నారు. దెయ్యం వల్ల కాలనీలో నివశిస్తున్న 40 కుటుంబాలు కాలనీని ఖాళీ చేసి వెళ్లిపోయాయి. కాలనీవాసులు వెళ్లిపోవడంతో ప్రస్తుతం గ్రామం నిర్మానుష్యంగా ఉంది. Also Read: మార్కెట్ లోకి కొత్తరకం ఆటోలు.. […]

Written By: Navya, Updated On : February 24, 2021 1:25 pm
Follow us on

మనలో చాలామంది దెయ్యాలు ఉన్నాయంటే అస్సలు నమ్మరు. అయితే జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో నివశించే ప్రజలు మాత్రం దెయ్యం పేరు వింటే గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. బేడ, బుడగజంగాల ప్రజలు దెయ్యం పేరు వింటే భయపడుతున్నారు. దెయ్యం వల్ల కాలనీలో నివశిస్తున్న 40 కుటుంబాలు కాలనీని ఖాళీ చేసి వెళ్లిపోయాయి. కాలనీవాసులు వెళ్లిపోవడంతో ప్రస్తుతం గ్రామం నిర్మానుష్యంగా ఉంది.

Also Read: మార్కెట్ లోకి కొత్తరకం ఆటోలు.. డీజిల్ తో అవసరం లేకుండా..?

కాలసీవాసులు కాలనీలోని ఒక పాడుబడిన భవనంలో రాత్రి సమయంలో దెయ్యం తిరుగుతోందని.. ఒక మహిళ బోనం తీసుకుని నాట్యం చేస్తుందని చెబుతున్నారు. కాలనీకి చెందిన చింతల భాను, చింతల బాలరాజు 2020 సంవత్సరం అక్టోబర్ నెలలో 7 రోజుల వ్యవధిలో మృతి చెందారు. అయితే చింతల భాను, చింతల బాలరాజు చనిపోవడానికి దెయ్యమే కారణమని గ్రామస్తులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.

Also Read: వివిధ రకాల బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసా..?

నిన్నటికి కాలనీ పూర్తి కావడం గమనార్హం. గ్రామానికి చెందిన గంధం శేఖర్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ కాలనీలో యువకులు మాత్రమే చనిపోతున్నారని యువకులు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా మృత్యువాత పడుతున్నారని చెప్పారు. ఆస్పత్రికి తీసుకొని వెళితే రిపోర్టులలో ఏ ఆరోగ్య సమస్య లేదని తేలుతోందని కానీ ఆ తరువాత మాత్రం వాళ్లు మరణిస్తున్నారని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

గ్రామ సర్పంచ్ ఎండబట్ల అంజమ్మ మాట్లాడుతూ పోలీసులు, కళాజాత బృందం కాలనీలో దెయ్యం లేదని చెప్పినా నమ్మడం లేదని.. వేరే చోట ఆ కుటుంబాలకు స్థలం కేటాయిస్తామని చెప్పినా వాళ్లు వినడం లేదని పేర్కొన్నారు.