దేశంలో సైబర్ మోసగాళ్ల మోసాల బారిన పడి ఇప్పటికే ఎంతోమంది లక్షల రూపాయలు నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాలకు చెందిన సైబర్ మోసగాళ్లు ఏటీఎం మెషిన్ లలో సైబర్ డివైజ్ ను అమర్చడం ద్వారా లక్షలాది రూపాయల నగదును డ్రా చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం.
Also Read: ఆ ఇంట్లో దెయ్యం.. కాలనీ ఖాళీ చేసిన 40 కుటుంబాలు..?
సైబర్ మోసగాళ్లు ఏటీఎం మెషిన్ పాస్‌వర్డ్‌ను దొంగిలించడంతో పాటు క్రెడిట్, డెబిట్‌కార్డ్స్ డేటాను తస్కరించడం ద్వారా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. డాక్టర్ శివరామకారంతనగర ఎస్బీఐ ఏటీఎంలో గత నెల 10వ తేదీన సైబర్ మోసగాళ్లు ఏటీఎంలో పరికరం అమర్చి 17.71 లక్షల రూపాయలు విత్ డ్రా చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్పెయిన్ కు చెందిన ఒక మహిళను అరెస్ట్ చేశారు.
Also Read: మార్కెట్ లోకి కొత్తరకం ఆటోలు.. డీజిల్ తో అవసరం లేకుండా..?
కొడిగేహళ్లి ఎస్బీఐ ఏటీఎం మెషిన్లో 10, 11, 14 తేదీలలో 1,40,000 రూపాయలు ఇదే విధంగా విత్ డ్రా అయ్యాయి. ఈ నగదును ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తి విత్ డ్రా చేశారనే విషయం ఏటీఎంలో రికార్డ్ కాకపోవడం గమనార్హం. వైట్‌ఫీల్డ్ సీఇఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్బీఐ అధికారులు ఈ ఘటన గురించి ఫిర్యాదు చేశారు. రాజాజీనగర పారిశ్రామికవాడ ప్రాంతంలోని ఏటీఎంలలో సైతం గడిచిన మూడు నెలలలో 78 లక్షల రూపాయలు ఈ విధంగా విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
నగదు ఏ అకౌంట్ నుంచి విత్ డ్రా చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. బ్యాంకు అధికారులు ఎంత తనిఖీ చేసినా అధికారులు ఈ మోసాలకు సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు. స్పెయిన్ యువతి నుంచి రూ.17 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె అనుచరులను కనిపెట్టే పనిలో పడ్డారు.