Telangana Elections : మోడీ సభ విజయవంతంగా పూర్తయిన తర్వాత రాత్రి జనసేన అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయ్యింది. 9 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. శేరిలింగంపల్లి బీజేపీ తీసుకొని.. తాండూర్ ను తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ కోసం తాండూర్ ను కేటాయించారు.
శేరిలింగపల్లికి బీజేపీ రవికుమార్ యాదవ్ కు టికెట్ కేటాయించేందుకు మొగ్గుచూపింది. అయితే ఇప్పటికీ అభ్యర్థులు ఫైనలైజ్ అయ్యారు. దీని ఎఫెక్ట్ గ్రౌండ్ లెవల్ లో ఎలా ఉంటుంది. జనసేన తెలంగాణలో ఏమేరకు దీన్ని సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.
తెలంగాణలో 32 సీట్ల నుంచి 9కి జనసేన పరిమితమైంది. వీళ్లు గ్రౌండ్ లెవల్ లోకి వెళ్లి జనాలను ఎలా ఆకట్టుకుంటారన్నది చూడాలి. ఇవ్వాల్టి నుంచి నవంబర్ 30 వరకూ తెలంగాణలో ఉండి జనసేన కోసం ప్రచారం చేయాలి. అప్పుడే జనసేన గెలుస్తుంది. బీజేపీ తరుఫున కూడా పవన్ ప్రచారం చేస్తే ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది..
ఇంతకీ ఎన్నికలైన తర్వాత ఎవరు ఎవరితో కలుస్తారు? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.