Virji Vora: ఈస్ట్ ఇండియా కంపెనీకే అప్పిచ్చిన భారతీయ వ్యాపారవేత్త గురించి తెలుసా ?

1619 నుంచి 1670 కాలంలో వ్యాపారంలో చురుకుగా ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, యాలకులు వంటివి హోల్ సెల్ వ్యాపారం చేసేవారు. ఉత్పత్తిదారుల కొనుగోలు చేసిన ఆయన భారీ లాభంతో విక్రయించేవారు.

Written By: Chai Muchhata, Updated On : August 16, 2023 10:55 am

Virji Vora

Follow us on

Virji Vora: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.. ఇక్కడ ప్రపంచంలోని కుభేరులతో పోటీ పడేవారు ఉన్నారు. దశాబ్దాలుగా ఇక్కడ కొందరు సంపన్నులుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించి భారీగా ఆదాయం పొందుతున్నారు. వ్యక్తిగతంగా వ్యాపారవేత్తలు అభివృద్ధి చెందడమే కాకుండా దేశానికి ఉపయోగపడే అనే కంపెనీలను నెలకొల్పారు. వందల ఏళ్లుగా భారతదేశం పరాయి పాలనలో కొనసాగింది. దీంతో భారతీయులు తీవ్రంగా అణిచివేయబడ్డారు. ఈ సమయంలో వారి జీవనస్థితిగతులు చిన్నాభిన్నం అయ్యాయి. రోజూవారీ కూలీ చేసుకోవడానికి కూడా ఆ సమయంలో అవకాశం లేకుండా ఉండేది. కానీ ఓ వ్యక్తి మాత్రం మొఘలుల కాలంలోనే వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఆయన సంపద ఎంత ఉందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకే అప్పు ఇచ్చేంత.. మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందామా..

మొఘలులు, బ్రిటిష్ కాలంలో భారతదేశ సంపద అంతా రాజుల వద్దే ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ కొందరు వ్యాపారవేత్తలు కూడా వారికంటే అత్యధిక ధనవంతులుగా కొనసాగారు. అలాంటి వారిలో గుజరాత్ కు చెందిన విర్జీ వోరా ఒకరు.. ఈ పేరు చాలా మందికి తెలియదు. కానీ ఈయన గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండరు. 1570లో జన్మించిన విర్జీవోరా 1670లో మరణించారు. విర్జీవోరా గుజరాత్ లోని శ్రీమాలి ఓస్వాల్ పోర్వాల్ కులానికి చెందిన వారని కొందరు చెబుతున్నారు.

1619 నుంచి 1670 కాలంలో వ్యాపారంలో చురుకుగా ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, యాలకులు వంటివి హోల్ సెల్ వ్యాపారం చేసేవారు. ఉత్పత్తిదారుల కొనుగోలు చేసిన ఆయన భారీ లాభంతో విక్రయించేవారు. అలాగే నల్లమందు, బులియన్, పగడపు దంతాలు, సీసం వంటి అనేక రకాల వస్తువులతో వ్యాపారం చేసేవాడు. విర్జీవోరాకు చెందిన ఓడరేవులు ఆగ్నేసియా, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఓడరేవుల్లో కనిపిస్తాయి. అలాగే ప్రధాన వ్యాపార కేంద్రాల్లో విర్జివోరాకు ఏజెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం సుగంధ వ్యాపారం మాత్రమే కాకుండా విర్జీవోరా వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు.

1629 నుంచి 1668 మధ్య బ్రిటిష్ వారితో వ్యాపార సంబంధాలు కొనసాగించేవారు. ఇలా పెద్ద ఎత్తున వ్యాపారం చేసిన ఆయన ఈ రంగంలో గుత్తాధిపత్యం సాధించారు. ఇలా అన్ని రకాలుగా వచ్చిన ఆయన సంపద మొత్తం అప్పట్లోనే రూ.80 లక్షలు ఉండేది. ఇప్పటి ప్రకారం చూస్తే అవి కొన్ని లక్షల కోట్లు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించే సమయంలో ఖర్చుల కోసం విర్జీవోరాను ఆశ్రయించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా విర్జీవోరాకు అరబ్ రాజు షాజహాన్ నాలుగు గుర్రాలను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్న విర్జీవోరా వ్యాపార విషయంలో వారికి తరుచూ లేఖలు రాస్తూ వారితో స్నేహ సంబంధాలు కొనసాగించేవారు. వారికి అవసరమైనప్పుడు డబ్బు సాయం చేసేవారు. డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా బ్రిటిష్ ప్రతినిధులు విర్జీవోరా వద్దకు వచ్చేవారు.