Homeఎంటర్టైన్మెంట్Senior Hero Naresh: నరేశ్ ముగ్గురు భార్యలు ఎవరు..? అసలు ఆయన ఇన్ని పెళ్లిళ్లు ఎందుకు...

Senior Hero Naresh: నరేశ్ ముగ్గురు భార్యలు ఎవరు..? అసలు ఆయన ఇన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు..?

Senior Hero Naresh: నరేశ్, పవిత్ర లోకేశ్ వ్యవహారం మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నరేశ్ నాలుగో పెళ్లి, పవిత్ర రెండో పెళ్లి చేసుకోబుతున్నట్లు ప్రకటించగా ఆ తరువాత అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల నరేశ్ మూడో భార్య వారిద్దరిని మైసూర్ హోటల్ లో పట్టుకుంది. వారిపై దాడి చేయడానికి యత్నించింది. తన భర్తను పవిత్ర డబ్బు కోసం వలలో వేసుకుందని.. నరేశ్ కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని అంటోంది. దీంతో అసలు నరేశ్ కు, తన మూడో భార్యకు ఎందుకు వివాదం ఏర్పడింది..? అసలు నరేశ్ ముగ్గురు భార్యలు ఎవరు..? అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా సాగుతోంది.

Senior Hero Naresh
Ramya Raghupathi, Naresh

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణది ప్రత్యేక ప్రపంచం. ఆయనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య పద్మావతికి ఐదుగురు సంతానం. అయితే సినిమాలు తీస్తున్న క్రమంలో విజయనిర్మలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత కృష్ణ, విజయనిర్మలలు పెళ్లి చేసుకున్నారు. అయితే విజయనిర్మలకు అప్పటికే వేరే వ్యక్తితో పెళ్లి అయింది. వారిద్దరికి పుట్టిన సంతానమే నరేశ్. కానీ విజయనిర్మలను పెళ్లి చేసుకున్న తరువాత నరేశ్ ను కృష్ణ సొంత కొడుకులా చూసుకునేవారు. పండండి కాపురం అనే సినిమాతో నరేశ్ ను బాలనటుడిగా పరిచయం చేశారు. ఆ తరువాత ప్రేమ సంకెళ్లు అనే సినిమాతో హీరోగా మార్చారు.

Also Read: Pavithra Lokesh Old Pics Viral : అంత నీట్ గా ఉండే పవిత్రా లోకేష్ గతంలో అంత బోల్డ్ నా? హాట్ ఫొటోలు లీక్

ఇక నరేశ్ సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ సినిమాటోగ్రాఫర్ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే విజయనిర్మల సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేపథ్యంలో వీరికి అరెంజ్డ్ మ్యారేజ్ చేశారు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే నరేశ్ మొదటి భార్య అనారోగ్యంగా ఉండేది. దీంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత ప్రముఖ రచయిత దేవలపల్లి కృష్ణశాస్త్రి మనుమరాలైన రేఖ సుప్రియను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. అయితే వీరు కూడా రెండేళ్లకు మించి కలిసుండలేకపోయారు. అయితే వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కానీ వీరు విడిపోయినా ఎన్జీవో కోసం ఇప్పటికే కలిసి పనిచేస్తారు.

Senior Hero Naresh
Senior Hero Naresh

ఇక పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్న కూతురు రమ్య రఘుపతిని నరేశ్ మూడో వివాహం చేసుకున్నారు. విజయనిర్మల సినిమాల్లో కొనసాగుతున్న సమయంలో ఆమె దగ్గర మెళకువలు నేర్చుకునేందుకు రమ్య వచ్చేశారు. ఈ సమయంలో నరేశ్ తో చనువుగా ఉండేవారు. ఆ తరువాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పటికే నరేశ్ కు 50 ఏళ్లు. రమ్యకు 30 ఏళ్లు. వీరు కూడా రెండుళ్లు కలిసి ఉండి ఆ తరువాత మూడేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల కొందరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిందన అభియోగాలు రమ్య పై వచ్చాయి. దీంతో ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు నరేశ్ ప్రకటించారు.

Senior Hero Naresh
Senior Hero Naresh, pavitra lokesh

కానీ రమ్య మాత్రం ఇప్పటికీ నరేశే నా భర్త అంటోంది. అంతేకాకుండా పవిత్ర లోకేశ్ డబ్బు కోసం తన భర్తను వలలో వేసుకుందని ఆరోపిస్తోంది. పవిత్రతో అక్రమ సంబంధం కోసమే తనన్ని దూరం పెట్టారని, నరేశ్ కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని అంటున్నారు. కానీ నరేశ్ మాత్రం డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తున్నాడు. అయితే ముందు ముందు ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందోనని ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.

Also Read:Chor Baazar 11 days Collections : ‘చోర్ బజార్’తో నష్టాలు పాలైన బయ్యర్లు !

Recommended Videos

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular