https://oktelugu.com/

Adarsha Patashalalu : 4 నెలల నుంచి జీతాల్లేవు.. ధనిక తెలంగాణలో పండుగ పూట ఈ టీచర్ల పస్తులు

మానవతా దృక్పధంతో మమ్మల్ని ఆదుకోండని.. నాలుగు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని టీచర్లంతా వేడుకుంటున్నాం

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2023 / 04:45 PM IST
    Follow us on

    Adarsha Patashalalu : పండుగ పూట కూడా ఆ ఉపాధ్యాయులను పస్తులు ఉంచాల్సిన దౌర్భగ్యపు పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ధనిక రాష్ట్రంలో చదువులు చెప్పే ఆ టీచర్లకు జీతాలు నాలుగు నెలలుగా లేవంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఇదే మన దౌర్భాగ్యం. ధనిక తెలంగాణలో టీచర్లు అనుభవిస్తున్న నరకం ఇదీ..

    ఆదర్శ పాఠశాలలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించి 10 సంవత్సరాలు గడుస్తోంది.అందులో 2015 సంవత్సరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా 1240 మంది ఉపాధ్యాయులను అవర్లి బేస్డ్ గా (గంటల లెక్కలో వేతనం చెల్లింపు కింద) కొనసాగిస్తున్నారు.

    2020 నుండి వీళ్లకు రెన్యూవల్ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతీసారి జీతాల కోసం ఎదురుచూపులే.. ఈ టీచర్ల జీవితాలతో అటు ప్రభుత్వం ఆటాడుకుంటోంది. అసలు జీతాలు చెల్లించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే కథ.

    ఈ విద్యాసంవత్సరం జూన్ నుండి ఈ టీచర్లు తమ పోస్టుల కోసం పోరాడితే ఆగస్టులో 10 తారీఖున రెన్యూవల్ చేసారు. ఇది ఇలా ఉంటే స్కూల్ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు జీతాలు రాకపోవడంతో ఆ టీచర్లకు పండుగ పూట కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విడ్డూరం ఏంటంటే పండగపూట పిల్ల పాపలతో ఎలా బతికేది అని ప్రతి నాయకుల దగ్గరికి వెళ్లి విజ్ఞాపన పత్రాలు ఇస్తున్న ఇప్పటివరకు జీతాలు రాలేదు. ప్రభుత్వం స్పందించడం లేదు. దున్నపోతు మీద వానపడ్డట్టుగా అధికారులు పట్టించుకోవడం లేదు. టీచర్లు ఎంత గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవడం లేదు.

    100 పీరియడ్ లకే జీతం కట్టించే ప్రభుత్వం ఈ టీచర్లతో 150, 160 క్లాస్ లు చెప్పిస్తోంది. అయినా కష్టమనుకోకుండా చేస్తున్న కూడా నాలుగు నెలల నుండి జీతాలు లేక పిల్లల ఫీజులు కట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. కనబడిన ప్రతినాయకులను వేడుకుంటున్న ఈ టీచర్లకు ఇప్పటిదాకా జీతాలు లేవు. దీంతో తాము ఈ పండగ ఎలా జరుపుకోవాలి అని తీవ్ర మనోవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈ టీచర్ల ప్రతీ ఇంట ఇవే బాధలు దుఖాలు మిగిలాయని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇకనైనా అధికారులు తమ జీవితాలు బాధలు అర్ధం చేసుకొని వర్క్ డన్ షీట్ల పేరిట ఈ సంవత్సరం బాధలు పడేటట్లు చేయడం సరి సరికాదని కోరుతున్నారు. మానవతా దృక్పధంతో మమ్మల్ని ఆదుకోండని.. నాలుగు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని టీచర్లంతా వేడుకుంటున్నాం