సాధారణంగా నేను సీఎం అయితే అది ఇది చేస్తానని చాలా మంది అలివికానీ హామీలిస్తారు. కొందరైతే సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పుతానని బోలెడు హామీలిస్తారు. ఇక తమిళనాడులోనైతే అమ్మాయిలకు స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు, యువతకు స్మార్ట్ ఫోన్లు అంటూ వరాల వాన కురిపిస్తారు. కానీ మన జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఆశ్చర్యపరిచాడు. ఒక వేళ తాను సీఎం అయితే ఏం చేస్తానో చెప్పి సర్ ప్రైజ్ చేశాడు. ఆ మాట ఇప్పుడు జనసైనికులను, సాధారణ ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరిచింది.

‘గీతా సారాంశాన్ని నమ్మే వ్యక్తిని నేను. కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తాను. ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇస్తే చేసుకుంటూ పోతాను. లేకున్నా ప్రజలకు దాసుడిగానే ఉంటాను. అధికారం వస్తే ఏం చేస్తానో చెప్పడం లేదు. నాకున్నదాంట్లో ఎంత చేయగలనో చేస్తాను. వైసీపీ పాలన ఘోరంగా ఉంది. దీన్ని మార్చే శక్తి యువతకు ఉంది. కళ్లముందు తప్పు జరిగితే చూస్తూ ఊరుకోను. ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా నిలబడ్డానని.. ఓటమియే గెలుపునకు పునాది. ప్రజల తరుఫున పోరాటం ఆపను’ అంటూ పవన్ కళ్యాణ్ ఉద్వేగ భరిత ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
సాధారణంగా ఏ సీఎం క్యాండిడేట్ అయినా తాను ముఖ్యమంత్రిని అయితే అది ఇది చేస్తానని కుప్పలుతెప్పలుగా వరాలు కురిపిస్తారు. కానీ మన పవన్ మాత్రం సాధారణ వ్యక్తిలానే ఆలోచించాడు. సీఎం అయినా కూడా ప్రజలకు జనరంజక పాలనే తన అభిమతమని చాటాడు. తన శక్తి మేర.. తనకు ఉన్న దాంట్లో ఎంత చేయగలనో అంతే చేస్తానన్నారు.
ఈ కాలంలో సామాన్యులకే ప్రజల కష్టాలు తెలుసు. అందుకే ఆమ్ ఆద్మీ అధికారంలోకి వచ్చింది. సామాన్యుడు కేజ్రీవాల్ సీఎం అయ్యారు. ఈ కోవలోనే సామాన్యుడి ఫార్ములానే పవన్ అవలంభిస్తున్నట్టు అర్థమవుతోంది.అందుకే అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపించే మాయమాటలకు స్వస్తి పలికి ఆచరణాత్మకంగా ప్రజలకు ఏం చేస్తానో.. ఏం చేయగలనో కూడా వివరించాడు. అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజలకు చేరువ చేస్తోంది.

ఇంత నీతిగా..నిజాయితీగా రాజకీయాలు చేస్తాడు కాబట్టి పవన్ అంటే అంత అభిమానం. అచ్చం కేజ్రీవాల్ సైతం ఇలానే సామాన్యుడిలాగానే వెళ్లాడు. అక్కడ అధికారం సాధించాడు. ఇప్పుడు ఏపీ ప్రజల దృష్టికోణం కూడా మారితే అలాంటి సామాన్యుడిలా కలిసిపోతున్న పవన్ కళ్యాణ్ కు వచ్చేసారి అధికారం దక్కడం ఖాయం. ఇప్పుడు పవన్ వ్యవహారశైలి కూడా అందుకు అనుగుణంగా మారడం మనం గమనించవచ్చు. మరి పవన్ సీఎం కోరికను జనాలు నెరవేరుస్తాడా? ఆయన ఆశించినట్టు సీఎం అవుతాడా? తేలాలంటే 2024 అసెంబ్లీ ఎన్నికల వరకూ వేచిచూడాల్సిందే.
[…] CM Kcr- Prashant Kishor: రాజకీయాల్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆయన జోడు గుర్రాల సవారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. డబ్బు కోసం దేనికైనా సిద్ధమేనన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తానని వారి దగ్గర మాట తీసుకుని ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేందుకు సిద్ధం కావడం చూస్తుంటే డబ్బు కోసం గడ్డి తినేందుకు కూడా వెనకాడటం లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో పరస్పర శత్రువులుగా ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఎలా ఏకకాలంలో సేవలందిస్తారనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. పీకే వ్యవహారం గందరగోళంగా ఉందని పెదవి విరుస్తున్నారు. […]
[…] Virat Kohli: ఫార్మాట్ ఏదైనా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వైఫల్యాలను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ అవుట్ కాగా.. శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం అయ్యింది. […]
[…] […]