Analysis on Alwar Temple Demolition Clashes దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఆలయాల కూల్చివేత రాజకీయాలు మొదలయ్యాయి. యూపీలో మొదలైన బుల్డోజర్ రాజకీయాలు ఇప్పుడు దేశమంతా పాకుతోంది. దేశంలో భవనాల కూల్చివేత పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను కూల్చివేయడం వివాదాస్పదమైంది.

శుక్రవారం రాజస్థాన్ లో కూడా పలు నిర్మాణాలను కూల్చివేశారు. అల్వార్ జిల్లాలో 300 ఏళ్ల నాటి శివాలయం, 86 దుకాణాలు, ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసి రోడ్డు మార్గం కోసం కూల్చడం సంచలనమైంది. నగర అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్ అంటూ పురాతన ఆలయాన్ని కూల్చివేశారు.
కూల్చివేతల్లో కూడా అందులోని పురాతన శివ లింగాన్ని కూడా కనీసం కదల్చకుండా తీయకుండా దాన్ని అందులోనే కూల్చి ముక్కలు చేయడం హిందుత్వ వాదుల ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది.
ఇక్కడ వందల ఏళ్ల నాటి మూడు ఆలయాలను కూల్చివేయడం మరో వివాదానికి దారితీసింది.సరాయి మొహల్లా ప్రాంతంలోని 300 సంవత్సరాల పురాతన శివాలయం సహా మరో రెండు ఆలయాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. దీనిపై హిందూ సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేవాలయాల రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.