Amit Shah : అమిత్ షా ఖమ్మం సభ తర్వాత బీజేపీ అవకాశాలు మెరుగయ్యాయా?

అమిత్ షా ఖమ్మం సభ తర్వాత బీజేపీ అవకాశాలు మెరుగయ్యాయా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : August 29, 2023 3:55 pm

Amit Shah : ఖమ్మంలో అమిత్ షా జరిపిన సభ తర్వాత తెలంగాణలో పరిస్థితులు ఎలా మారాయి? ముందు రోజు చేవెళ్లలో మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ సభ.. ఆ మరుసటి రోజు అమిత్ షా ఖమ్మంలో సభతో తెలంగాణలో హీట్ నెలకొంది.

కేసీఆర్ ను అమిత్ షా తీవ్రంగా విమర్శించారు. మునుపటి కంటే విమర్శల్లో వాడి వేడి పెరిగింది. అమిత్ షా మాట్లాడిన మాటల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ప్రజల మనసుల్లో నాటారు. ఎంఐఎంతో కలిసి ఉన్న బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదని తేల్చి చెప్పాడు.

ఖమ్మం వేదికగా జరిగిన రైతు ఘోష.. బీజేపీ భరోసా బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన ఆధ్వర్యంలో పాలిస్తున్న కుటుంబ పార్టీకి అవకాశం ఇస్తే మళ్లీ ప్రజలను మోసం చేస్తారని హెచ్చరిం చారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ కుటుంబ పార్టీలే.. సోనియా గాంధీ కుటుంబం కోసం, తన కుమారుడి కోసం పని చేస్తోందని, కేసీఆర్‌ కూడా సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకుని పని చేస్తున్నారని ఆరోపించారు. కారు స్టీరింగ్‌ ఓవైసీ చేతుల్లో ఉందని, ఓవైసీతో కలిసి తెలంగాణ పోరాట యోధులను విస్మరించారని అమిత్‌షా ఆరోపించారు. ‘తెలంగాణ అమరుల కలలను బీఆర్‌ఎస్‌ నాశనం చేసింది. కేసీఆర్‌ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ పార్టీ ఓడిపోతుంది. తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుందని’ అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ 4జీ పార్టీ, బీఆర్‌ఎస్‌ 2 జీ పార్టీ, ఎంఐఎం 3 జీ పార్టీ. తెలంగాణలో మాత్రం అధికారంలోకి వచ్చేది మోడీ పార్టీనే అని అమిత్‌షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అరెస్ట్‌లతో బీజేపీ నేతలను భయపెట్టాలని కేసీఆర్‌ చూస్తున్నారని, అలాంటి ఆటలు ఇకపై చెల్లవని అమిత్‌షా హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారని, అది ఎంత మాత్రం నెరవేరదని షా స్పష్టం చేశారు. ఓవైసీ నడిపే కారును మళ్లీ గెలిపించొద్దని తెలంగాణ ప్రజలకు అమిత్‌ షా పిలుపునిచ్చారు

అమిత్ షా ఖమ్మం సభ తర్వాత బీజేపీ అవకాశాలు మెరుగయ్యాయా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.