https://oktelugu.com/

India Alliance : ‘ఇండియా’ కూటమి పేరుతోనో, కొత్త లోగోతోనో మోడీ కి పోటీ కాలేదు

త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఈ ఇండియా కూటమి ఎలా కలిసి పోటీచేస్తారన్నది ప్రశ్న. ఈ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పోటీలో ఉంటుందా? ఉండదా? అన్నది ఆసక్తికరంగా మారింది..

Written By:
  • NARESH
  • , Updated On : August 30, 2023 / 03:36 PM IST

    India Alliance : ఇండియా కూటమి రేపు ఆగస్టు 31-సెప్టెంబర్ 1న ముంబైలో సమావేశమవుతోంది. కొత్త లోగోను ఆవిష్కరించబోతున్నారు. కూటమి ‘ఇండియా’ పేరు బాగుందని ప్రతిపక్షాలు బాగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే పేరుతోనే.. లోగోతోనో ఓట్లు పడుతాయనుకుంటే అంతకన్నా కలల్లో విహరించేవారు ఇంకొకరు ఉండరు. కేవలం ‘ఇండియా’ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఓట్లు పడవు. ప్రజలంతా అమాయకులని మీరు అనుకోవద్దు.

    ఈ ఇండియా కూటమి గెలవడం సంగతి పక్కన పెడితే పోటీలో నిలబడాలంటే అసలు ఏం చేయాలన్నది ఆలోచిస్తే.. అసలు దరిదాపుల్లో కూడా లేరు.

    ఇండియా కూటమి విజయం సాధించాలంటే.. కూటమిలోని పార్టీలు ఒకరి మీద ఒకరు పోటీచేయకుండా ఉండాలి. ఈ పొత్తును ప్రజలు విశ్వసించాలంటే మీలో మీరు కొట్టుకోవద్దు. కేరళ, బెంగాల్, ఉత్తరాఖండ్ , యూపీలలో జరిగే 7 ఉప ఎన్నికల్లో ఐక్యత చూపించకుండా కాంగ్రెస్, సీపీఐ, సమాజ్ వాదీ, టీఎంసీ పార్టీలు ఎవరికి వారే పోటీచేస్తున్నారు. దీంతో వీరిని ప్రజలు ఎలా నమ్మాలన్నది ఇక్కడ ప్రశ్న. 7 సీట్లలో ఐక్యత చూపని వీరు 547 స్థానాల్లో ఎలా చూపిస్తారన్నది ప్రశ్న.

    త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఈ ఇండియా కూటమి ఎలా కలిసి పోటీచేస్తారన్నది ప్రశ్న. ఈ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పోటీలో ఉంటుందా? ఉండదా? అన్నది ఆసక్తికరంగా మారింది..

    ‘ఇండియా’ కూటమి పేరుతోనో, కొత్త లోగోతోనో మోడీ కి పోటీ కాలేదు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.