Rakhi Festival Wishes: హిందూ సంప్రదాయం ప్రకారం మనం ఎన్నో పండగలు చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా తోబుట్టువుల మధ్య చేసుకుని పవిత్రమైన పండుగ రక్షాబంధన్. ఈ సంవత్సరం ఈ పండుగ ఆగస్టు 30 , 31 వ తారీకుల్లో జరుపుకోవడం జరుగుతుంది. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి నాడు రాఖీని జరుపుకుంటారు. ఈరోజు తమ బంధానికి సూచనగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకి పవిత్రమైన రాఖీని కడతారు.
ఇది కేవలం ఒక పండుగగా మాత్రమే జరుపుకునే అంశం కాదు ప్రతి కుటుంబం యొక్క ఐకమత్యానికి నిదర్శనంగా జరుపుకునే పండుగ. ఇంటి ఆడపిల్లను గౌరవించాలి, ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండాలి అని, జీవితాంతం అమ్మ నాన్న బాధ్యత తానే వహిస్తానని భరోసా ఇస్తూ ఒక సోదరుడు ఇచ్చే వాగ్దానం. అందుకే ఈ పండుగకు ఇంత ప్రాముఖ్యతను ఇస్తారు.
ఈ రాఖీ రక్షణకు సూచన.. ఆనాడు చిన్న దెబ్బకు తన చీర చించి కట్టినందుకు కృష్ణుడు ద్రౌపదిని కురు సభలో జరగబోయే అవమానం నుంచి కాపాడాడు. ఈ పండుగను భారతీయులు ఎంతో ప్రాముఖ్యతతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణుల కోసం ప్రత్యేకంగా కానుకలు కూడా ఇస్తారు.
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ విపరీతంగా నడవడంతో.. ఆన్లైన్లో ఎక్కడ చూసినా రక్షాబంధన్ కు సంబంధించిన పలు రకాల కొటేషన్స్ కనిపిస్తున్నాయి. మీకోసం మా తరఫునుంచి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని యూనిక్ కొటేషన్స్…
అమ్మలో సగమై ..నాన్నలో సగమై…అన్నీ నువ్వే అయ్యి..కంటిపాపలా చూసుకుని అన్నయ్యకు…రక్షా బంధన్ శుభాకాంక్షలు!
అందమైన అనుబంధం.. అంతులేని అనురాగం.. అన్నా చెల్లెలు అద్భుత బంధం…ఎప్పటికీ తరగని రుణానుబంధం.
అన్నా…చెల్లెళ్ల ..అక్క …తమ్ముళ్ల ప్రేమాభిమానానికి ప్రతీకైనా రాఖీ పండుగ శుభాకాంక్షలు…
అమ్మలో… ఆ.. నాన్నలో నా…కలిపితే మా అన్న…నీలాంటి తోడు జీవితాంతం ఉన్నందుకు సంతోషిస్తూ రాఖీ శుభాకాంక్షలు …మీ చెల్లి…
నీకెంత వయసు వచ్చినా ..ఇంకా నువ్వు నా కంటికి చిన్న పిల్లవే.. ఎప్పటికీ నా చెల్లివే…కొండంత ప్రేమ పంచే నా బంగారు తల్లికి రాఖీ శుభాకాంక్షలు తో మీ అన్నయ్య..