
Mega Peoples Survey On Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ, అధికార వైసీపీతోపాటు, విపక్ష టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ముందుగానే పార్టీ శ్రేణలను జనంతో మమేకం చేసే కార్యక్రమాల్లో నిమగ్నం చేశారు. అటు ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో జగన్‌ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు తాను సింగిల్గానే పోటీ చేస్తానని జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో అసలు ప్రజల్లో ఎవరికి ఎంత బలం ఉందనే అంశం చర్చకు వస్తోంది. ఇదే అంశంపై నిర్వహిస్తున్న మెగా పీపుల్స్ సర్వేలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
1.60 కోట్ల కుటుంబాలను కలిసేలా..
రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ఈ నెల 7న ప్రారంభించారు. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వీనర్లు, ప్రతీ 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వలంటీర్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలో‍్లని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. దీనిని పార్టీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం రెండో విడత కొనసాగుతోంది. కార్యకమం ద్వారా ప్రజలకు జగన్ అందిస్తున్న సంక్షేమం ద్వారా ప్రభుత్వానికి- ప్రజల మధ్య సంబంధాలను మరింత దగ్గర చేయటమేనని స్పష్టం అవుతోంది.
47 లక్షల మంది మద్దతు..
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కొనసాగుతోంది. జనం సీఎం వైఎస్ జగన్ స్టిక్కర్లను వాకిళ్లకు ఇష్టంగా అతికించుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగనన్న సైన్యం రాష్ట్రంలోని ప్రతీ గడపకు వెళ్తున్నారని పార్టీ నేతలు వెల్లడించారు. తొలి వారంలో 61 లక్షల గృహాలను సందర్శిస్తే 47 లక్షలకు పైగా మద్దతు తెలిపినట్లు తెలిపారు. వారంలోనే ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం దేశంలోనే చరిత్రగా పేర్కొన్నారు. స్వచ్ఛందంగా 82960 82960 నంబర్‌కు మిస్ట్ కాల్ ఇచ్చి మద్దతు తెలుపుతున్నారని వివరించారు. ఇదేదో మొక్కుబడి సర్వేగా కాకుండా.. జగనన్న సైన్యం ప్రజల వద్దకు వెళ్లి, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను చెప్పి వాళ్ల మద్దతుతో సర్వే చేస్తున్నారు.

5 కోట్ల మందికి చేరువయ్యేలా..
మరో వారంపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దీని ద్వారా మొత్తం 1.60 కోట్ల కుటుంబాలను కలవటమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ కుటుంబాల ద్వారా దాదాపు అయిదు కోట్ల మందికి చేరువ కావాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్ర భవిష్యత్ జగనన్నే, మన పిల్లల భవిష్యత్ జగనన్నతోనే అంటూ ప్రతీ ఇంటా అర్దమయ్యేలా వివరిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్ణయాలు.. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో అమలు అవుతున్న నిర్ణయాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ప్రతీ ఇంటికి స్టిక్కర్లు వేస్తున్నారు. అది కూడా కుటుంబ సభ్యుల అనుమతితోనే. దీంతో, ఇప్పుడు వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమంలో ఏక కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రజల ముందుకు వెళ్తున్నారు.
ఈ సర్వే తుది నివేదిక.. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా జగన్ ఎన్నికలకు కావాల్సిన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.
సర్వేలో ఏం తేలిదంటే?
ఈ పీపుల్స్ సర్వే లో ఏపీ వ్యాప్తంగా దాదాపు 47 లక్షల మంది జగన్ కు మద్దతు తెలిపారు. వారంలోనే ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం విశేషం. ఈ సర్వేలో మెజార్టీ జగన్ కే మా మద్దతు అని ప్రకటించడంతో ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ రెడీ అవుతున్నారు. పీపుల్స్ సర్వే ప్రకారం ఏపీలో జగన్ కు పాజిటివ్ వాతావరణమే కనిపిస్తోంది.వచ్చేసారి గెలుపు అవకాశాలు జగన్ కే ఉంటాయని అర్థమవుతోంది.