
Ram Charan- Janhvi Kapoor: యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ దశ తిరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ కొట్టేశారట. ఈ మేరకు ఓ వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. శ్రీదేవి వారసురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది జాన్వీ. ఆమె మొదటి చిత్రం ధడక్. 2018లో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ విడుదలైంది. ఈ ఐదేళ్లలో జాన్వీ పలు చిత్రాల్లో నటించారు. ప్రయోగాలు చేశారు. కానీ ఆమె స్టార్స్ పక్కన కమర్షియల్ చిత్రాల్లో ఆఫర్స్ రాలేదు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ నటిస్తుంది.
త్వరలో జాన్వీ కపూర్ ఈ చిత్ర షూట్లో పాల్గొననున్నారు. ఎన్టీఆర్ 30కి నుండి ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. లంగా ఓణీలో మిడిల్ క్లాస్ అమ్మాయిగా జాన్వీ కనిపించారు. అలాగే సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు మంచి వెయిట్ ఉంటుందని దర్శకుడు కొరటాల చెప్పారు. సమ్మర్ కానుకగా 2024లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఎన్టీఆర్ పక్కన జాన్వీకి ఛాన్స్ రావడానికి ఒకే కారణం ఆమె శ్రీదేవి కూతురు కావడం. శ్రీదేవికి తెలుగులో కూడా భారీ ఫేమ్ ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలతో పాటు చిరంజీవి, నాగార్జున, వెంకీలతో శ్రీదేవి జతకట్టారు. బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించారు. సౌత్ ని ఒక ఊపు ఊపిన శ్రీదేవి నార్త్ ఇండియాను షేక్ చేశారు. అంతటి ఘన చరిత్ర శ్రీదేవి సొంతం. ఆమె వారసురాలంటే ఓ హైప్ ఉంటుంది.

ఎన్టీఆర్-శ్రీదేవి వారసులు నటించిన చిత్రం అనే ప్రత్యేకత ఎన్టీఆర్ 30కి దక్కింది. ఎప్పటి నుండో జాన్వీ కపూర్ ని సౌత్ కి తేవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ 30తో అది సాకారం అయ్యింది. అయితే రామ్ చరణ్ కూడా జాన్వీ కావాలంటున్నాడని లేటెస్ట్ టాక్. దర్శకుడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేయనున్న మూవీలో హీరోయిన్ గా జాన్వీని అనుకుంటున్నారట. ఆమెతో చర్చలు జరుపగా పచ్చ జెండా ఊపిందని సమాచారం. ఈ మేరకు ఓ వార్త టాలీవుడ్ ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే జాన్వీ పంట పండినట్లే.