Samantha Ruth Prabhu vs Producer Chittibabu : కౌంటర్లకు ఎన్ కౌంటర్లు పడుతున్నాయి. పురుషాధిక్య సమాజంలో మహిళలు ఏదీ పడడం లేదు. ఇచ్చిపడేస్తున్నారు. ఇక్కడ సమంత అయినా.. అక్కడ సెలీనా జైట్లీ అయినా ఆడవాళ్లను అంటే ఊరుకోమంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. తమను తిట్టిన వాళ్ల తాట తీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇటీవల కాటికి కాలు చాపిన ఔట్ డేటెడ్ నిర్మాత చిట్టిబాబు తనకు సంబంధం లేని ఇష్యూలో కాలు వేలు దూర్చాడు. సెలబ్రెటీల జీవితాలు వారి పర్సనల్. విడిపోతారు.. విడాకులు వారి వ్యక్తిగత వ్యవహారం. దానిపై ఎవరూ కలుగజేసుకోవడానికి ఉండదు. కానీ ఖాళీగా ఏ సినిమాలు లేకుండా ఉన్న నిర్మాత చిట్టిబాబు మాత్రం స్టార్ హీరోయిన్ సమంతపై నోరుపారేసుకున్నారు.

‘సమంత రోగం, ఏడుపు అంతా నాటకం. సింపథీ కార్డుతో సినిమాలకు ప్రచారం తెచ్చుకోవాలని చూస్తుంది. ప్రతిసారీ ఇది వర్క్ అవుట్ కాదు. ఏడ్చినంత మాత్రాన ప్రేక్షకులు సినిమాలను ఆదరించారు. అయినా సమంత స్టార్డం ఎప్పుడో పోయింది. బతుకుదెరువు కోసం వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది. శాకుంతలం మూవీకి ఆమె సెట్ కాదు. ఆమె వలెనే ప్లాప్ అయ్యింది’ అన్నారు చిట్టిబాబు. ఈ చిట్టిబాబు ఆరోపణలపై సమంత పరోక్షంగా స్పందించారు.
చిట్టిబాబు చెవులపై ఉన్న వెంట్రుకలను ఉద్దేశిస్తూ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. ‘బాడీలో టెస్టోస్టిరాన్ ఎక్కువైతే అలా చెవుల మీద వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయంటూ’ సెటైర్ వేసింది. సమంత నిర్మాత చిట్టిబాబు పేరు ప్రస్తావించనప్పటికీ ఆయన మీదే సమంత ఈ సెటైర్ వేశారన్నది సుస్పష్టం. దీంతో పలు మీడియా సంస్థలు వరుస కథనాలు రాశారు.
Dear Mr Sandhu hope posting this gave you the much needed girth & length to become a man & some hope to cure you of your erectile dysfunction. There are others ways to fix your problem..like going to a doctor, you must try it sometime! #celinajaitly @TwitterSafety pls take action https://t.co/VAZJFBS3Da
— Celina Jaitly (@CelinaJaitly) April 11, 2023
ఇక్కడ సమంత మాత్రమే కాదు.. బాలీవుడ్ లో సెలీనా జైట్లీ కూడా తనను విమర్శించే వారిపై ఇలానే ‘టెస్టోస్టీరాన్’ హార్మోన్ ను ప్రస్తావించి మరీ కౌంటర్ ఇచ్చింది. తనపై కామెంట్ చేసిన ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధూను ఏకిపారేస్తూ ట్వీట్ చేసింది. ‘ప్రియమైన మిస్టర్ ఉమైర్ సంధూ, ఈ పోస్ట్ చేయడం వల్ల మనిషిగా మారడానికి మీకు అవసరమైన బుద్ది లభిస్తుందని ఆశిస్తున్నాను. మీ అంగస్తంభన సమస్య నుండి ఉపశమనం పొందగలరని ఆశిస్తున్నాను. మీ సమస్యను పరిష్కరించడానికి ఇతర మార్గాలు ఉన్నాయి..వైద్యుని వద్దకు వెళ్లడం వంటివి ప్రయత్నించాలి! ’ అంటూ టెస్టోస్టీరాన్ ను ప్రస్తావించారు.
దీంతో అసలు ఈ టెస్టోస్టీరాన్ హార్మోన్ ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందన్న చర్చ సాగుతోంది. సాధారణంగా పురుషుల్లో టెస్టోస్టీరాన్ ఎక్కువైతే వారికి కామ కోరికలు బాగా పెరుగుతాయని వైద్యులు చెబుతారు. వారు శృంగారం కోసం ఆగలేరు. తపిస్తారు. మన భాషలో చెప్పాలంటే కామ పిశాచులు.. మన అరుంధతి సినిమాలో ‘పశుపతి’లాగా.. ఆడ వాసన తగిలితే ‘వదల బొమ్మాళీ’ అంటూ వెంటపడుతారు. వేధిస్తారు. కోరిక తీర్చుకుంటారు. అయితే ఈ టెస్టోస్టీరాన్ ఎక్కువైందని ఎలా గుర్తించడం అంటే.. వారి చెవుల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. అలా పెరిగాయంటే వారికి టెస్టోస్టీరాన్ ఎక్కువగా విడులైందని.. కామ కోరికలు ఎక్కువగా ఉన్న మనిషి అని అర్థం.
దీన్నే బేస్ చేసుకొని ఇక్కడ సమంత.. అక్కడ సెలీనా జైట్లీ తమను విమర్శించిన ప్రత్యర్థులకు ఒక్క ట్వీట్ తో గట్టి బుద్ది చెప్పారు. ఇప్పటికైనా ఈ మగ మదమెక్కిన మదగజాలు బుద్దితెచ్చుకొని వింటాయో లేదో చూడాలి.